Telugu Global
National

సోషల్ మీడియాది పక్షపాతం.. పార్లమెంట్ లో సోనియా ధ్వజం..

గతంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియాపై ధ్వజమెత్తారు కానీ, ఈసారి సోనియాగాంధీ, ఏకంగా పార్లమెంట్ లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్నారని, వారికి ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారని, భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న అతిపెద్ద దాడి ఇదని విమర్శించారు సోనియా గాంధీ. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని.. ఎన్నికల రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం జోక్యం చేసుకుంటూ ప్రభావితం చేస్తున్నాయని […]

సోషల్ మీడియాది పక్షపాతం.. పార్లమెంట్ లో సోనియా ధ్వజం..
X

గతంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియాపై ధ్వజమెత్తారు కానీ, ఈసారి సోనియాగాంధీ, ఏకంగా పార్లమెంట్ లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్నారని, వారికి ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారని, భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న అతిపెద్ద దాడి ఇదని విమర్శించారు సోనియా గాంధీ. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని.. ఎన్నికల రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం జోక్యం చేసుకుంటూ ప్రభావితం చేస్తున్నాయని సోనియా ఆరోపించారు. రాజకీయ పార్టీలు, నేతలు, వారి అనుచరులు తమ రాజకీయ ప్రచారం కోసం సామాజిమాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారని, దీన్ని నివారించాలని సోనియా డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కబళించేందుకు సోషల్‌ మీడియా ఉపయోగపడడం ఒక ప్రమాదకరమైన పరిణామామని ఆందోళన వ్యక్తం చేశారామె.

సామాజిక మాధ్యమాలు అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించట్లేదని విమర్శించారు సోనియా గాంధీ. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి ఫేస్‌బుక్‌ తక్కువ ధరలకే ఎన్నికల ప్రకటనలు జారీచేసే అవకాశం ఇచ్చిందని అల్‌ జజీరా ప్రచురించిన ఒక నివేదికను సోనియా ప్రస్తావించారు. అధికార పార్టీతో, సామాజిక మాధ్యమ సంస్థలు కుమ్మక్కయ్యాయని ఈ నివేదికలు నిరూపిస్తున్నాయని ఆమె అన్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై ఫేస్‌బుక్‌, భారత్ లో సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తోందని సోనియా ఆరోపించారు. రాహుల్‌ గాంధీ కూడా సామాజిక మాధ్యమాలపై ధ్వజమెత్తారు. అయితే దీనికి కూడా ఆయన సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ని వాడుకోవడం విశేషం. ట్విట్టర్ లో ఆయన తన కామెంట్లు ఉంచారు. ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా.. ప్రజాస్వామ్యానికి హానికరం అని రాహుల్ ట్వీట్‌ చేశారు.

ఫేస్ బుక్ పై ఏడుపెందుకు..?
మరోవైపు సోనియా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఆడలేక మద్దలె ఓడన్నట్టుగా.. కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ఉందని అంటున్నారు బీజేపీ నేతలు. ఐదు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్, దానికి సోషల్ మీడియా సంస్థల్ని బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా వల్లే అంతా జరిగితే.. కాంగ్రెస్ కి ఆమాత్రం సీట్లు కూడా వచ్చేవి కావని అంటన్నారు.

First Published:  17 March 2022 12:56 AM GMT
Next Story