Telugu Global
Cinema & Entertainment

100 రోజులు షూటింగ్ పూర్తి

యంగ్ టాలెంట్ నటుడు తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది. ఇదిలా ఉంటే టీమ్ 100వ రోజు షూటింగ్ జరుపుకుంది. ఇది చిత్ర యూనిట్ కష్టం, కృషి వల్లే సాధ్యపడింది. సినిమా కోసం పనిచేసిన దాదాపు అందరు నటీనటులు, సాంకేతిక సిబ్బంది సవాలుగా తీసుకుని పని చేస్తున్నారు. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అదీకాక సూపర్ హీరో కొన్ని క్లిష్టమైన […]

100 రోజులు షూటింగ్ పూర్తి
X

యంగ్ టాలెంట్ నటుడు తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది. ఇదిలా ఉంటే టీమ్ 100వ రోజు షూటింగ్ జరుపుకుంది. ఇది చిత్ర యూనిట్ కష్టం, కృషి వల్లే సాధ్యపడింది.

సినిమా కోసం పనిచేసిన దాదాపు అందరు నటీనటులు, సాంకేతిక సిబ్బంది సవాలుగా తీసుకుని పని చేస్తున్నారు. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అదీకాక సూపర్ హీరో కొన్ని క్లిష్టమైన విన్యాసాలు చేస్తాడు. హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా వీటిని షూట్ చేస్తున్నారు. తేజ చాలా రోజుల పాటు వరుసగా 8 గంటల పాటు రోప్‌పై ఉండాల్సి వచ్చింది. ఇది గంటలు పాటు ఉండటమే కాదు, ఈ సమయాల్లో గాయాలు కూడా సాధారణం.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సీనియర్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ దీనికి పని చేస్తున్నారు. చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

First Published:  17 March 2022 6:26 AM GMT
Next Story