Telugu Global
Cinema & Entertainment

బిచ్చగాడు-2 థీమ్ సాంగ్ ఇదే

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై స్వయంగా హీరోనే నిర్మిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా మారాడు. వీటితో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల్ని కూడా అతడే చూసుకుంటున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న, బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ తాజాగా ను విడుదల చేశారు. […]

బిచ్చగాడు-2 థీమ్ సాంగ్ ఇదే
X

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై స్వయంగా హీరోనే నిర్మిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా మారాడు. వీటితో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల్ని కూడా అతడే చూసుకుంటున్నాడు.

కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న, బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ తాజాగా ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.

ఈ థీమ్ సాంగ్ చూస్తే …రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి.

చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో థీమ్ సాంగ్ లో చెప్పేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా వినిపిస్తూ, ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది బిచ్చగాడు 2 థీమ్ సాంగ్.

First Published:  16 March 2022 10:56 AM GMT
Next Story