Telugu Global
National

హిజాబ్ పై కర్నాటక హైకోర్టు తుది తీర్పు..

హిజాబ్ వివాదానికి కర్నాటక హైకోర్టు ముగింపు పలికింది. ఫిబ్రవరి 25న తీర్పుని రిజర్వ్ చేసిన త్రిసభ్య ధర్మాసనం నేడు తుది తీర్పునిచ్చింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. యూనిఫామ్ అంటే యూనిఫామ్ మాత్రమేనని చెప్పింది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై వివిధ విద్యాసంస్థలు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. […]

హిజాబ్ పై కర్నాటక హైకోర్టు తుది తీర్పు..
X

హిజాబ్ వివాదానికి కర్నాటక హైకోర్టు ముగింపు పలికింది. ఫిబ్రవరి 25న తీర్పుని రిజర్వ్ చేసిన త్రిసభ్య ధర్మాసనం నేడు తుది తీర్పునిచ్చింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. యూనిఫామ్ అంటే యూనిఫామ్ మాత్రమేనని చెప్పింది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై వివిధ విద్యాసంస్థలు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టుకు..
విద్యా సంస్థల్లో హిజాబ్‌ వస్త్రధారణపై ఫిబ్రవరిలో కర్నాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఉడుపి సహా పలు జిల్లాల్లో హిజాబ్‌ కు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హిజాబ్ సహా ఇతర మతపరమైన దుస్తులేవీ ధరించి విద్యాసంస్థలకు హాజరు కావద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న తీర్పుని రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం తాజాగా తుది తీర్పునిచ్చింది. అయితే దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది.

స్కూళ్లకు సెలవలు..
హిజాబ్ పై కర్నాటక హైకోర్టు తుదితీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంది. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచారు. తీర్పు వెలువరించిన త్రిసభ్య ధర్మాసనంలోని జడ్జిల నివాసాల వద్ద భద్రత పెంచారు. సున్నిత ప్రాంతాల్లో ఈనెల 19 వరకు 144 సెక్షన్‌ విధించారు. ఉడుపిలో ఈరోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

First Published:  15 March 2022 1:58 AM GMT
Next Story