Telugu Global
NEWS

ఏపీ అసెంబ్లీలో రభస.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలకు కల్తీ సారాయే కారణం అంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. సమావేశాల్లో పాల్గొనేందుకు మద్యం సీసాలను పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. ఇక సభలో కూడా టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో అధికార పక్షం కూడా అంతే ధీటుగా స్పందించింది. అవి కల్తీ సారా మరణాలు కాదని, సహజ మరణాలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు. శవ రాజకీయాలకు […]

ఏపీ అసెంబ్లీలో రభస.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
X

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలకు కల్తీ సారాయే కారణం అంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. సమావేశాల్లో పాల్గొనేందుకు మద్యం సీసాలను పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. ఇక సభలో కూడా టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో అధికార పక్షం కూడా అంతే ధీటుగా స్పందించింది. అవి కల్తీ సారా మరణాలు కాదని, సహజ మరణాలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు.

శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌ తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఎన్టీఆర్‌ మద్య నిషేధం తెచ్చారన్నారు. మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో సహజ మరణాలను టీడీపీ వక్రీకరిస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో జరిగినవి సాధారణ మరణాలని.. టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కూడా టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారాయన. నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై సీఎం జగన్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని అసెంబ్లీలో మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తామన్నారు.

సస్పెన్షన్..
సభ ప్రారంభంలో టీడీపీ సభ్యుల ఆందోళనతో కాసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ్యులు జంగారెడ్డి గూడెం వ్యవహారంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. బడ్జెట్‌ ప్రసంగంపై చర్చకు అడ్డుపడుతున్నారని.. వారిని బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయ స్వామిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

First Published:  14 March 2022 4:03 AM GMT
Next Story