Telugu Global
Cinema & Entertainment

సుమ కనకాల రీఎంట్రీకి డేట్ ఫిక్స్

బుల్లితెరపై దశాబ్దానికి పైగా బిజీగా ఉన్న సుమ కనకాల, ఎట్టకేలకు వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసిన ఈవిడ, మళ్లీ ఇన్నేళ్లకు సిల్వర్ స్క్రీన్ పైకి లీడ్ రోల్ తో ముందుకొస్తున్నారు. సుమ నటించిన జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే సినిమాల‌ను చూసుకుని చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు. విజయ్ కుమార్ […]

సుమ కనకాల రీఎంట్రీకి డేట్ ఫిక్స్
X

బుల్లితెరపై దశాబ్దానికి పైగా బిజీగా ఉన్న సుమ కనకాల, ఎట్టకేలకు వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసిన ఈవిడ, మళ్లీ ఇన్నేళ్లకు సిల్వర్ స్క్రీన్ పైకి లీడ్ రోల్ తో ముందుకొస్తున్నారు. సుమ నటించిన జయమ్మ పంచాయితీ' విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే సినిమాల‌ను చూసుకుని చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు.

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా… టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో సినిమా ప్రచారాన్ని పెంచుతున్నారు. ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు.

ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ ఈ సినిమాలో నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇకపై బుల్లితెర వ్యాఖ్యాతగా కనిపిస్తూనే, మనసుకు నచ్చిన కథలతో సినిమాలు కూడా చేస్తానని ఈ సందర్భంగా సుమ ప్రకటించింది.

First Published:  14 March 2022 1:34 PM IST
Next Story