Telugu Global
International

చైనాలో మళ్లీ లాక్ డౌన్..

దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ భయాలు తొలగిపోతున్న వేళ.. మరోసారి కొవిడ్ పై ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తోంది. అయితే ఇది భారత్ లో కాదు. కరోనా పుట్టిళ్లుగా చెబుతున్న చైనాలో. అవును.. చైనాలోని చాంగ్ చున్ నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోవడంతో లాక్ డౌన్ విధించారు. చాంగ్ చున్ లో 90 లక్షలమంది ప్రజలు నివశిస్తుంటారు. వీరంతా ఇప్పుడు లాక్ డౌన్ తో ఇల్లు కదలలేని పరిస్థితి. చాంగ్ చున్ లో రోజువారీ వ్యాపార కార్యకలాపాలు […]

చైనాలో మళ్లీ లాక్ డౌన్..
X

దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ భయాలు తొలగిపోతున్న వేళ.. మరోసారి కొవిడ్ పై ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తోంది. అయితే ఇది భారత్ లో కాదు. కరోనా పుట్టిళ్లుగా చెబుతున్న చైనాలో. అవును.. చైనాలోని చాంగ్ చున్ నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోవడంతో లాక్ డౌన్ విధించారు. చాంగ్ చున్ లో 90 లక్షలమంది ప్రజలు నివశిస్తుంటారు. వీరంతా ఇప్పుడు లాక్ డౌన్ తో ఇల్లు కదలలేని పరిస్థితి. చాంగ్ చున్ లో రోజువారీ వ్యాపార కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. రవాణా నిలిచిపోయింది. ప్రజలు ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం అందరికీ కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేస్తోంది.

78వేల మందికి వైరస్..
చైనాలోని చాంగ్ చున్ కి ఆటో క్యాపిటల్ గా పేరుంది. చాంగ్ చున్ లో వారం రోజుల్లోనే కేసులు భారీగా పెరిగాయి. మొత్తం 78వేలమంది మరోసారి కరోనా ప్రభావానికి గురయ్యారని అంచనా. ఇటీవల కొవిడ్ కేసులు భారీగా తగ్గిపోగా.. జీరో టాలరెన్స్ అనే విధానాన్ని చైనా ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అంటే.. కనీసం ఒక్క కొవిడ్ కేసు నమోదయినా సరే ఆ ప్రాంతంపై ఆంక్షలు విధిస్తున్నారు. దీని ప్రకారం ఇప్పుడు చాంగ్ చున్ మొత్తం ఆంక్షల వలయంలో చిక్కుకుపోయింది.

2020లో కొవిడ్ వ్యాప్తి తర్వాత వుహాన్ నగరంలో తొలిసారిగా చైనా లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రపంచం కొవిడ్ గుప్పెట్లోనుంచి బయటపడుతోంది. అయితే వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు. అక్కడక్కడ దాని జాడ బయటపడుతూనే ఉంది. తాజాగా చైనాలోనే కొవిడ్ మరోసారి విజృంభించడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

First Published:  11 March 2022 10:04 AM GMT
Next Story