Telugu Global
Cinema & Entertainment

ఆసక్తికరంగా మారిన 'హత్య'

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హత్య’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా.. హీరోయిన్ రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా […]

ఆసక్తికరంగా మారిన హత్య
X

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హత్య’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా.. హీరోయిన్ రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగనుంది. అందమైన మోడల్ లీల తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు అనేది మిస్టరీగా మారుతుంది. డిటెక్టివ్, పోలీస్ కోణంలో ఈ కేసు ఛేదనలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో ‘హత్య’ సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేయబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానని చెబుతున్నాడు విజయ్ ఆంటోనీ.

First Published:  9 March 2022 9:12 PM GMT
Next Story