Telugu Global
Cinema & Entertainment

దమ్మీ ఇవ్వడానికి రెడీ అయిన మాస్ కా బాప్

ఫలక్ నుమా దాస్, పాగల్, హిట్, చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం `దాస్ కా ధమ్కీ`. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. `ఎఫ్3` దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ […]

దమ్మీ ఇవ్వడానికి రెడీ అయిన మాస్ కా బాప్
X

ఫలక్ నుమా దాస్, పాగల్, హిట్, చిత్రాల హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణం లో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. 'ఎఫ్3' దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరించారు.

హీరోగా విశ్వక్ సేన్, తన స్వంత నిర్మాణంలో చేస్తున్న రెండో సినిమా ఇది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్, ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నాడు. పాగల్ దర్శకుడు నరేశ్ చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో హీరో పేరు కృష్ణ దాస్. అతడి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. ఈనెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారు.

విశ్వక్-నివేత కాంబోలో ఇంతకుముందు పాగల్ అనే సినిమా వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయింది. అయినప్పటికీ మరోసారి ఇదే కాంబినేషన్, ఇదే దర్శకుడితో సినిమా సెట్ అవ్వడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సినిమాకు లియో సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 March 2022 11:21 AM GMT
Next Story