Telugu Global
National

భారత విద్యార్థుల్లో చైనా టెన్షన్..

ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు తమ భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారనేది తెలిసిన విషయమే. కేంద్రం వారి పట్ల సానుకూల ధోరణితో ఉందని ఇతర దేశాల్లో లేదా, భారత్ లోని ప్రైవేటు కళాశాల్లలో వారికి మిగతా కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంటర్న్ షిప్ విషయంలో ఈమేరకు కేంద్రం హామీ కూడా ఇచ్చింది. అయితే ఈ దశలో ఇప్పుడు చైనా నుంచి వచ్చిన విద్యార్థులకు ఆ దేశం డెడ్ లైన్ […]

భారత విద్యార్థుల్లో చైనా టెన్షన్..
X

ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు తమ భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారనేది తెలిసిన విషయమే. కేంద్రం వారి పట్ల సానుకూల ధోరణితో ఉందని ఇతర దేశాల్లో లేదా, భారత్ లోని ప్రైవేటు కళాశాల్లలో వారికి మిగతా కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంటర్న్ షిప్ విషయంలో ఈమేరకు కేంద్రం హామీ కూడా ఇచ్చింది. అయితే ఈ దశలో ఇప్పుడు చైనా నుంచి వచ్చిన విద్యార్థులకు ఆ దేశం డెడ్ లైన్ పెట్టిందనే వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది.

చైనాలో కూడా వైద్య విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులు చాలామందే ఉన్నారు. వారంతా అక్కడ కరోనా ప్రబలిన తర్వాత భారత్ కి తిరిగొచ్చేశారు. రెండేళ్లుగా వారు ఇంటిపట్టునే ఉంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైనా కూడా చాలామంది చైనా వెళ్లేందుకు సాహసం చేయలేదు. ఈలోగా ఆన్ లైన్ లో పాఠాలు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు చైనాలోని ఆయా కాలేజీలనుంచి విద్యార్థులకు పిలుపులు వస్తున్నాయి. జూన్ లోపు చైనాకి తిరిగొచ్చి ఇంటర్న్ షిప్ పూర్తి చేయలేకపోతే సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.

కోర్సు పూర్తయినా ఇంటర్న్ షిప్ తప్పనిసరి..
కోర్సు చివర్లో భారత్ కి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు ఆన్ లైన్లో పాఠాలు చెప్పి ఫీజులు వసూలు చేశాయి చైనా కాలేజీలు. అయితే ఇప్పుడు ఇంటర్న్ షిప్ కి మాత్రం కచ్చితంగా చైనాకు రావాల్సిందేనని కండిషన్లు పెడుతున్నాయి. అది కూడా జూన్ లోగా రాలేకపోతే డిగ్రీ క్యాన్సిల్ చేస్తామని చెబుతున్నారట. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

కేంద్రానికి వేడుకోలు..
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లో వెసులుబాటు ఇచ్చినట్టే.. తమకు కూడా నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇవ్వాలని చైనా నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వేడుకుంటున్నారు. అదే సమయంలో చైనా యూనివర్శిటీలతో మాట్లాడి తమ సర్టిఫికెట్ సమస్య తీర్చాలని కూడా వారు కోరుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో విదేశీ వైద్య విద్య విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే మాట నిజమవుతోంది. భారత్ లో వైద్య విద్యకు ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న సీట్లు, ఫీజుల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు చైనా విద్యార్థులు కూడా ఉక్రెయిన్ బాధితుల్లాగే వెసులుబాటు అడుగుతున్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

First Published:  8 March 2022 11:44 PM GMT
Next Story