Telugu Global
Cinema & Entertainment

కొత్త జీవో వచ్చింది.. టాలీవుడ్ కు ఊపొచ్చింది

టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జీవో రానే వచ్చింది. ముఖ్యమంత్రి జగన్, ఈ ఫైల్ పై సంతకం చేశారు. ఈరోజు లేదా రేపట్నుంచి ఈ జీవో అమల్లోకి వస్తోంది. కొత్త జీవో రాకతో, ఏడాది కిందట రిలీజ్ చేసిన జీవో 35 రద్దయింది. తాజా జీవో ప్రకారం, ఏపీలో టికెట్ రేట్లు మధ్యస్తంగా పెరిగాయి. దీంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. పెద్ద సినిమాలకు ఇది వరంగా మారింది. కొత్త జీవో ప్రకారం.. టికెట్ రేట్లు కనిష్టంగా 20 […]

tollywood hero
X

టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జీవో రానే వచ్చింది. ముఖ్యమంత్రి జగన్, ఈ ఫైల్ పై సంతకం చేశారు. ఈరోజు లేదా రేపట్నుంచి ఈ జీవో అమల్లోకి వస్తోంది. కొత్త జీవో రాకతో, ఏడాది కిందట రిలీజ్ చేసిన జీవో 35 రద్దయింది. తాజా జీవో ప్రకారం, ఏపీలో టికెట్ రేట్లు మధ్యస్తంగా పెరిగాయి. దీంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. పెద్ద సినిమాలకు ఇది వరంగా మారింది.

కొత్త జీవో ప్రకారం.. టికెట్ రేట్లు కనిష్టంగా 20 రూపాయల నుంచి గరిష్టంగా 250 రూపాయల వరకు ఉంది. హీరో-దర్శకుడు రెమ్యూనరేషన్లు తప్పించి, మూవీ బడ్జెట్ వంద కోట్లు దాటితే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. రిలీజైన రోజు నుంచి 10 రోజుల పాటు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఈసారి ప్రభుత్వం ఓ నిబంధన విధించింది. సినిమాలో కనీసం 20శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు మాత్రమే కొత్త రేట్ల నిబంధన వర్తిస్తుంది. లేదంటే ఆంక్షలు తప్పనిసరి.

అయితే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు మాత్రం వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే, ఈ సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకున్నాయి కాబట్టి. ఇక ఆచార్య, ఎఫ్3 లాంటి సినిమాలకు ఆ బాధ ఉండదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమా షూటింగ్స్ జరిగాయి కాబట్టి. కేజీఎఫ్ 2, బీస్ట్, విశాల్ లాఠీ లాంటి డబ్బింగ్ సినిమాల పరిస్థితేంటనేది మాత్రం ఇంకా తేలలేదు.

ఇక సినిమా టికెట్ రేట్ల విషయానికొస్తే.. మున్సిపల్ కార్పొరేషన్లలో థియేటర్ కేటగిరీ బట్టి 40 రూపాయల కనిష్ట ధర నిర్ణయించారు. మల్టీప్లెక్స్ విషయానికొచ్చేసరికి ఇది అత్యథికంగా 250 రూపాయల వరకు ఉంది. ఇక మున్సిపాలిటీల్లో కనిష్ఠ ధర 30 రూపాయలు, నగర-గ్రామ పంచాయతీల్లో కనిష్ట ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. ఓవైపు సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధర ఉంచుతూనే, మరోవైపు పరిశ్రమకు అనుకూలంగా మిగతా కేటగిరీల్లో ధరలు పెంచారు.

First Published:  7 March 2022 8:57 PM GMT
Next Story