Telugu Global
National

పెరగడం గ్యారెంటీ.. ఎంత అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న..

క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లు దాటిపోయాయి. 125 డాలర్లకు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ లో మాత్రం ఇంకా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో మార్పు లేదు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న సందర్భంలో కూడా భారత్ లో రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది కేంద్రం. మరి అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతున్నా కూడా సైలెంట్ గా ఉందంటే దానికి ఏకైక కారణం […]

పెరగడం గ్యారెంటీ.. ఎంత అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న..
X

క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లు దాటిపోయాయి. 125 డాలర్లకు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత్ లో మాత్రం ఇంకా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో మార్పు లేదు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న సందర్భంలో కూడా భారత్ లో రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది కేంద్రం. మరి అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతున్నా కూడా సైలెంట్ గా ఉందంటే దానికి ఏకైక కారణం ఎన్నికలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నాడు చివరి దశ పోలింగ్. పోలింగ్ పూర్తయిన సాయంత్రమే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజల్ని భయపెడుతున్నాయి. పోనీ అలాంటిదేమీ లేదు అనుకుందామంటే.. కేంద్రం ఆమేరకు హామీ కూడా ఇవ్వడం లేదాయె. అంటే కేంద్రం మౌనం రాబోయే తుపాన్ కి ముందు ఉన్న ప్రశాంతత లాంటిదే అనుకోవాలి.

పెరగడం గ్యారెంటీ..
అంతర్జాతీయ మార్కెట్‌ లో చమురు ధరలు క్రమంగా పైపైకి కదిలి, రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే వంటనూనెలు, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి, పెరుగుతున్నాయి. హోల్ సేల్ గా అమ్మే ఇంధన ధరల్ని ఇప్పటికే పెంచింది కేంద్రం. రిటైల్ లో లభించే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే అది ఎంత అనేదే ఇప్పుడు తేలాల్సిన విషయం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీట‌ర్‌ కు రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని అంచనా. ఒకేసారి ఆ స్థాయిలో పెంచకపోయినా.. గతంలో లాగా రెండ్రోజులకోసారి పెంచే అవకాశముంది.

ఇప్పటికే రికార్డ్ ధరలు..
ఇప్పటికే భారత్‌ లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిని చేరుకున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిపై పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించి కాస్త ఉపశమనం కలిగించింది కేంద్రం. ఎన్నికల సమయంలో అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా కేంద్రం తన సహజ ధోరణికి భిన్నంగా రేట్లు పెంచలేదు. ఇక పోలింగ్ అయిపోయిన మరుక్షణం మాత్రం రేట్లు భారీగా పెరుగుతాయనే అనుమానం అందరిలో ఉంది. ఎన్నికలైపోతున్నాయి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి అంటూ రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని కేవలం సెటైర్లుగా పరిగణించలేం. భారత్ లో పెట్రో బాంబ్ పేలడానికి రెడీగా ఉంది. కానీ దాని విధ్వంసం, విస్ఫోటన స్థాయి ఎంత అనేదే ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది.

First Published:  6 March 2022 8:15 AM GMT
Next Story