Telugu Global
Cinema & Entertainment

స్టాండప్ రాహుల్ ట్రయిలర్ రివ్యూ

రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగిశాయి. ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుదల చేశారు. ట్రయిలర్ చూస్తుంటే.. స్టాండప్ కామెడీ చుట్టూ ఈ […]

స్టాండప్ రాహుల్ ట్రయిలర్ రివ్యూ
X

రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగిశాయి. ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను విడుదల చేశారు.

ట్రయిలర్ చూస్తుంటే.. స్టాండప్ కామెడీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందనే విషయం అర్థమౌతోంది. సినిమాలో రాజ్ తరుణ్ తనకు ఇష్టమైన పని చేయకుండా ఇంకేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది. తల్లి పోరు పడలేక జాబ్ చేస్తున్నట్టు.. ఆఫీస్ లో హీరోయిన్ పరిచయం అయినట్టు చూపించారు.

ప్రేమకు రాజ్ తరుణ్ వ్యతిరేకమని, హీరోయిన్ తో సహజీవనం చేస్తాడేమో అనే అనుమానం వచ్చేలా ట్రయిలర్ ను కట్ చేశారు. చివరికి హీరో తను అనుకున్నది చేశాడా లేదా హీరోయిన్ ప్రేమను పొందాడా లేదా అనేది సినిమా.

ట్రయిలర్ లో విజువల్స్ బాగున్నాయి. మనాలీలో తీసిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కీలక పాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, ఇంద్రజ, మురళీశర్మలను కూడా ట్రయిలర్ లో చూపించారు.

హీరో రాజ్ తరుణ్ కు ఇది 15వ సినిమా. ఈమధ్య కాలంలో వరుసగా ఫ్లాపులిస్తున్న ఈ హీరో ఈ స్టాండప్ రాహుల్ తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

First Published:  5 March 2022 7:26 AM GMT
Next Story