Telugu Global
Cinema & Entertainment

ఎవరీ గాలి నాగేశ్వరరావు?

ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన […]

ఎవరీ గాలి నాగేశ్వరరావు?
X

ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. చోటా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నాడు. జి.నాగేశ్వర రెడ్డి మూలకథ అందించారు.

కాగా ఈ సినిమాలో తన చేస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ గెటప్ ని తన ట్విట్టర్ ద్వారా రివీల్ చేసారు మంచు విష్ణు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వినూత్నంగా వెల్లడించబోతోంది యూనిట్. అసలు నాగేశ్వరరావు ఎవరు.. అతడికి గాలి అనే పేరు ఎందుకొచ్చింది అనే వివరాల్ని వెల్లడిస్తారు.

First Published:  5 March 2022 7:29 AM GMT
Next Story