Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా లాంచ్ చేసిన ఆది

డిఫరెంట్ రేంజ్ లో, డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో సిద్ధం అయ్యారు. హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆది సాయికుమార్ తో సినిమా లాంఛ్ చేశారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. ఫణి […]

మరో సినిమా లాంచ్ చేసిన ఆది
X

డిఫరెంట్ రేంజ్ లో, డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో సిద్ధం అయ్యారు. హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆది సాయికుమార్ తో సినిమా లాంఛ్ చేశారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. ఫణి కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ తనను సంప్రదించాడని తెలిపిన రాధామోహన్… ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయన్నారు. ఆది సాయికుమార్ ఈ సబ్జెక్ట్ కి సరిగ్గా సరిపోతాడని.. అందుకే తీసుకున్నామని తెలిపాడు.

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మరో ప్రత్యేక సందర్భంలో ప్రకటిస్తారు.

First Published:  5 March 2022 7:23 AM GMT
Next Story