Telugu Global
NEWS

రైతుల మద్దతుకోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..

భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ కి రైతు నాయకుడిగా పేరుంది. ఆ తర్వాత వచ్చిన ప్రధానుల్లో పీవీకి పారిశ్రామిక విప్లవ పితామహుడిగా, రాజీవ్ గాంధీ కి టెక్నాలజీ సృష్టికర్తగా, మన్మోహన్ సింగ్ కి గొప్ప ఆర్థిక వేత్తగా పేరుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి చాలా రకాల ఎలివేషన్లు ఇస్తుంటారు పార్టీ నాయకులు. ఇప్పుడు కొత్తగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. రైతు బాంధవుడు అనే ట్యాగ్ లైన్ కోసం తపిస్తున్నారు. ఇటీవలే వివిధ […]

రైతుల మద్దతుకోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..
X

భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ కి రైతు నాయకుడిగా పేరుంది. ఆ తర్వాత వచ్చిన ప్రధానుల్లో పీవీకి పారిశ్రామిక విప్లవ పితామహుడిగా, రాజీవ్ గాంధీ కి టెక్నాలజీ సృష్టికర్తగా, మన్మోహన్ సింగ్ కి గొప్ప ఆర్థిక వేత్తగా పేరుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి చాలా రకాల ఎలివేషన్లు ఇస్తుంటారు పార్టీ నాయకులు. ఇప్పుడు కొత్తగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. రైతు బాంధవుడు అనే ట్యాగ్ లైన్ కోసం తపిస్తున్నారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. సాగు చట్టాల రద్దుకోసం పోరాటం చేసిన రైతు సంఘాలకు నాయకత్వం వహించిన రాకేష్ టికాయత్ కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, కేవలం రైతులకోసం జరిగిన సమావేశం అని చెప్పుకొచ్చారు టికాయత్. కానీ కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం వెనక కచ్చితంగా రాజకీయ అజెండా ఉందనేది విశ్లేషకుల అంచనా.

తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం దేశమంతటికీ ఆదర్శం అంటున్నారు రాకేష్ టికాయత్. కేసీఆర్ విజన్ ని పొగిడేస్తూ.. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మెచ్చుకున్నారు. అంతే కాదు.. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన సాగు చట్టాల రద్దు ఉద్యమంలో పాల్గొని అమరులైనవారి కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తామన్నారని, త్వరలోనే ఆ లిస్ట్ ఆయనకిస్తామని చెప్పారు. ఢిల్లీలో కేసీఆర్ కి టికాయత్ భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పటికే ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న కేసీఆర్, ఇప్పుడిలా రైతు ఉద్యమ నాయకుల్ని, ఇతరత్రా ఉద్యమాలను నడిపేవారిని కలుస్తూ వారి మద్దతు కూడగట్టబోతున్నారు.

రైతు అంతర్జాతీయ సమ్మేళనం హైదరాబాద్ లో..
వచ్చే ఏడాది రైతుల అంతర్జాతీయ సమ్మేళనం జరపాలని అనుకుంటున్న రాకేష్ టికాయత్.. దానికి హైదరాబాద్ వేదికగా ఉంటుందని ప్రకటించారు. రైతుల పట్ల కేసీఆర్ కి ఉన్నతమైన ఆలోచనలున్నాయని పొగడ్తల్లో ముంచెత్తారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కుదిరితే ప్రధాని సీటు సాధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు కేసీఆర్. అయితే ఇతర రాష్ట్రాల నాయకులనుంచి ఆయనకు తీవ్రమైన పోటీ ఉంది. అందులోనూ కేసీఆర్ కి తెలంగాణలో కేవలం 17 లోక్ సభ స్థానాలే ఉన్నాయి. అంటే ఆమాత్రం సీట్లతో పార్లమెంట్ లో చక్రం తిప్పడం కష్టం. అందుకే ఇలా రైతు బాంధవుడిగా మారేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేసీఆర్ రైతుల దగ్గరే ఆగుతారా.. ఇతర వర్గాలను ఆకట్టుకోడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  3 March 2022 10:07 PM GMT
Next Story