Telugu Global
Cinema & Entertainment

బట్టర్ ఫ్లై టీజర్ రివ్యూ

‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. తర్వాత శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లో గురూ ప్రేమ కోస‌మే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజ‌ర్‌ […]

బట్టర్ ఫ్లై టీజర్ రివ్యూ
X

‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. తర్వాత శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లో గురూ ప్రేమ కోస‌మే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజ‌ర్‌ విడుద‌లైంది.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే… చాలా సంతోషంగా అపార్ట్ మెంట్‌లో అడుగుపెడుతుంది అనుపమ పరమేశ్వరన్‌. లిఫ్ట్ లో అడుగుపెట్టి తొమ్మిదో ఫ్లోర్‌ కి చేరుకోవాల్సిన ఆమె రెండు, నాలుగు, ఎనిమిదిలో ఎందుకు ఆగింది? అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యాలేంటి? స్టెప్స్ లో వెళ్లినప్పుడు తెలిసిన విషయాలేంటి? సరదాగా ఉండాల్సిన ఆ వయసులో ఆమెకు అర్థమైన అంశాలేంటి? అనేది ఈ సినిమా స్టోరీలా ఉంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అనుపమ లుక్‌ కూడా బాగుంది. కెమెరా ఫ్రేమ్‌ వర్క్ అద్భుతంగా ఉంది. జెన్‌ నెక్స్ట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్‌ అని టీజర్‌ చూడగానే అర్థమవుతోంది. మరి అలాంటి సబ్జెక్ట్ కి బటర్‌ఫ్లై అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.

First Published:  3 March 2022 5:43 AM GMT
Next Story