Telugu Global
NEWS

6 నెలల్లోపు అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి " హైకోర్టు

మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో గతంలోనే దీనిపై వివాదం సమసిపోయింది. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు వ్యవహారంపై మాత్రం కోర్టు ప్రస్తుతం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తీర్పునిచ్చింది. ఆరు నెలలలోగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. సీఆర్డీఏ చట్టంలో రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని చెప్పింది. […]

6 నెలల్లోపు అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి  హైకోర్టు
X

మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో గతంలోనే దీనిపై వివాదం సమసిపోయింది. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు వ్యవహారంపై మాత్రం కోర్టు ప్రస్తుతం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తీర్పునిచ్చింది. ఆరు నెలలలోగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని ఆదేశాలిచ్చింది. సీఆర్డీఏ చట్టంలో రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని చెప్పింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలలలోపు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెేసిన ప్లాట్లను అప్పగించాలని పేర్కొంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక సమర్పించాలని సూచించింది.

తనఖా పెట్టడానికి వీళ్లేదు..
రాజధాని కోసం ప్రజలనుంచి సేకరించిన భూమిని.. కేవలం రాజధాని అవసరాలకోసమే వినియోగించాలని సూచించింది ఏపీ హైకోర్టు. రాజధాని అవసరాలకు మినహా మిగతా ఏ విషయాల్లోనూ ఆ భూమిని తనఖా పెట్టేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఉన్నది ఉన్నట్టుగా మాస్టర్ ప్లాన్..
సీఆర్డీఏ చట్టంలో ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పింది హైకోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది. అదే సమయంలో కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

First Published:  3 March 2022 3:13 AM GMT
Next Story