Telugu Global
National

ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కి సరికొత్త ఉపాధి మార్గం..

ఉక్రెయిన్ లో వైద్య విధ్య ఖర్చు తక్కువ కావడంతో వేలాదిమంది భారతీయ విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్లారు. యుద్ధం వల్ల వారంతా తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం భారతీయ ఐటీ నిపుణులకు వరంగా మారబోతోంది. ఏకంగా లక్ష ఉద్యోగాలు ఐటీరంగంలో తూర్పు ఐరోపా దేశాలనుంచి భారత్ కు తరలి రాబోతున్నాయని సమాచారం. ఏ వ్యాపార సంస్థ అయినా ప్రశాంతంగా ఉండే […]

ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కి సరికొత్త ఉపాధి మార్గం..
X

ఉక్రెయిన్ లో వైద్య విధ్య ఖర్చు తక్కువ కావడంతో వేలాదిమంది భారతీయ విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్లారు. యుద్ధం వల్ల వారంతా తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం భారతీయ ఐటీ నిపుణులకు వరంగా మారబోతోంది. ఏకంగా లక్ష ఉద్యోగాలు ఐటీరంగంలో తూర్పు ఐరోపా దేశాలనుంచి భారత్ కు తరలి రాబోతున్నాయని సమాచారం.

ఏ వ్యాపార సంస్థ అయినా ప్రశాంతంగా ఉండే దేశంలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటుంది. యుద్ధ భయాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఉండే చోట పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు కూడా ముందుకు రావు. సరిగ్గా ఇప్పుడు ఉక్రెయిన్ లో అదే జరుగుతోంది. ఉక్రెయిన్, బెలారస్, రష్యా సహా.. వాటి సరిహద్దుల్లో ఉన్న తూర్పు ఐరోపా దేశాల్లో వివిధ కంపెనీలు ఇప్పటికే తమ బ్రాంచీలను మూసివేశాయి, వాటిని తరలించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఐటీ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగాల్లో ఉక్రెయిన్ లో పెద్ద పెద్ద కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేవి. ఇప్పుడు అవన్నీ పొరుగు దేశాలకు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా భారత్ లాభపడే అవకాశముందని అంచనా వేస్తున్నాయి ఇక్కడి ఐటీ కంపెనీలు.

లక్ష ఉద్యోగాలు..
బ్యాంకింగ్, రిటైల్, ఆటో మొబైల్, హెల్త్ కేర్ రంగాల్లో దాదాపు 30వేలమంది ఐటీ నిపుణులు ఉక్రెయిన్ కేంద్రంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ లోని గ్లోబల్ బిజినెస్ సెంటర్స్ లో 20వేలమంది పనిచేస్తున్నారు. బెలారస్, రష్యాలో థర్డ్ పార్టీ సేవల కింద మరో 30వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 10వేలమంది బెలారస్, రష్యాలోని గ్లోబల్ బిజినెస్ సెంటర్స్ లో ఉపాధి పొందుతున్నారు. మరో 10వేలమంది ఐటీ నిపుణులు ఇత రంగాల్లో ఉన్నారు. ఈ ఉద్యోగాలన్నీ ఇప్పుడు గాల్లో దీపాలుగా మారాయి. దాదాపుగా కంపెనీలన్నీ ఇప్పటికే తట్టాబుట్టా సర్దేశాయి. మరి ఇప్పటికిప్పుడు ఈ లక్ష ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లిపోవాలి. కనీసం వీటిలో 70వేల ఉద్యోగాలయినా భారత్ కి తరలి వస్తాయని అంచనా వేస్తోంది డల్లాస్ లోని మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ కంపెనీ. భారత్ లాంటి దేశాల్లో అయితే యుద్ధభయాలు ఉండవని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే.. అక్కడ సంక్షోభం, ఇక్కడ అవకాశాలకు సరికొత్త పునాది వేస్తుందన్నమాట.

First Published:  1 March 2022 9:07 PM GMT
Next Story