Telugu Global
NEWS

వామ్మో.. వాహ‌న‌దారుల దాడికి ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపు పోర్ట‌ల్ బెంబేలు

తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యంతో తెలంగాణ‌లో ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపులు జోరందుకున్నాయి. ఇన్నాళ్లూ పోలీసుల‌కు దొరికితే ట్రాఫిక్ పెండింగ్‌ చ‌లాన్లు లాగేస్తార‌ని భ‌య‌ప‌డిన జ‌న‌మంతా ఇప్పుడు ఎగ‌బ‌డి మ‌రీ చ‌లాన్లు చెల్లించేస్తున్నారు. ఒక్క నిమిషంలో 700 పెండింగ్ చ‌లాన్ల‌ను అధికారులు క్లియ‌ర్ చేస్తున్నారంటే.. చెల్లింపుల ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల క్లియ‌ర్ చేసేందుకు వాహ‌న‌దారుల‌కు పోలీసులు భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. పోలీసుల డిస్కౌంట్ నేటి నుంచి ఈనెల చివ‌రి వ‌ర‌కు […]

వామ్మో.. వాహ‌న‌దారుల దాడికి ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపు పోర్ట‌ల్ బెంబేలు
X

తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యంతో తెలంగాణ‌లో ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపులు జోరందుకున్నాయి. ఇన్నాళ్లూ పోలీసుల‌కు దొరికితే ట్రాఫిక్ పెండింగ్‌ చ‌లాన్లు లాగేస్తార‌ని భ‌య‌ప‌డిన జ‌న‌మంతా ఇప్పుడు ఎగ‌బ‌డి మ‌రీ చ‌లాన్లు చెల్లించేస్తున్నారు. ఒక్క నిమిషంలో 700 పెండింగ్ చ‌లాన్ల‌ను అధికారులు క్లియ‌ర్ చేస్తున్నారంటే.. చెల్లింపుల ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల క్లియ‌ర్ చేసేందుకు వాహ‌న‌దారుల‌కు పోలీసులు భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. పోలీసుల డిస్కౌంట్ నేటి నుంచి ఈనెల చివ‌రి వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది. తోపుడు బండ్ల‌కు 80 శాతం, బైక్‌లు, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 70 శాతం రాయితీ, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం, క‌రోనా టైంలో మాస్కులు లేకుండా ప్ర‌యాణించిన వారికి 90 శాతం రాయితీని క‌ల్పించారు. వ‌చ్చిన స‌ద‌వ‌కాశాన్ని బాగానే వినియోగించుకుంటున్నారు వాహ‌న‌దారులు.

గ‌డిచిన నాలుగేళ్ల‌లో తెలంగాణ వ్యాప్తంగా 6 కోట్ల‌కు పైగా ట్రాఫిక్ ఉల్లంఘ‌న కేసులు న‌మోద‌య్యాయి. వీటికి గానూ 2,300 కోట్ల రూపాయ‌ల జ‌రిమానాలు విధించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం మాత్ర‌మే వాహ‌న‌దారులు చెల్లించిన‌ట్లుగా పోలీసు శాఖ చెబుతోంది. మిగిలిన 50 శాతం కూడా చెల్లించేందుకు వాహ‌న‌దారుల‌కు అనువైన రాయితీని ప్ర‌క‌టించారు. కేవ‌లం హైద‌రాబాద్‌లోనే రూ.500 కోట్లు వ‌సూలు కావాల్సి ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

చలాన్ల చెల్లింపు కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా ఈ-చ‌లాన్ పోర్ట‌ల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రాయితీల‌తో ఆన్‌లైన్‌లోనే చ‌లాన్లు చెల్లించేలా పోర్ట‌ల్‌ను అప్‌డేట్ చేసింది. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ‌లోని వాహ‌న‌దారులంతా త‌మ వాహ‌నాల‌పై ఉన్న చ‌లాన్ల‌ను చెల్లించేందుకు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు.

First Published:  1 March 2022 2:31 AM GMT
Next Story