Telugu Global
Cinema & Entertainment

చోర్ బజార్ లో సీనియర్ నటి

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ […]

చోర్ బజార్ లో సీనియర్ నటి
X

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ తెలిపింది..

ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించింది అర్చన. వీడు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు.

చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది అర్చన. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

First Published:  1 March 2022 9:12 AM GMT
Next Story