Telugu Global
National

భారత్ కు తొలి విషాదం.. ఉక్రెయిన్ లో కర్నాటక విద్యార్థి దుర్మరణం..

చదువుకోడానికి వెళ్లి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓ దశలో విమాన ప్రయాణానికి అవకాశం లేకపోవడంతో వారంతా పిల్లల ప్రాణాలపై బెంగపెట్టుకున్నారు. ఆ తర్వాత సరిహద్దు దేశాల ద్వారా విద్యార్థులను భారత్ కు తరలించే ప్రయత్నాలు మొదలు కావడం.. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తిరిగి రావడంతో అందరిలో ఆందోళన తగ్గింది. మిగతా వారు కూడా త్వరలోనే తిరిగి స్వదేశానికి చేరుకుంటారనే భరోసా తల్లిదండ్రులకు వచ్చింది. ఈ దశలో భారత్ […]

భారత్ కు తొలి విషాదం.. ఉక్రెయిన్ లో కర్నాటక విద్యార్థి దుర్మరణం..
X

చదువుకోడానికి వెళ్లి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓ దశలో విమాన ప్రయాణానికి అవకాశం లేకపోవడంతో వారంతా పిల్లల ప్రాణాలపై బెంగపెట్టుకున్నారు. ఆ తర్వాత సరిహద్దు దేశాల ద్వారా విద్యార్థులను భారత్ కు తరలించే ప్రయత్నాలు మొదలు కావడం.. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తిరిగి రావడంతో అందరిలో ఆందోళన తగ్గింది. మిగతా వారు కూడా త్వరలోనే తిరిగి స్వదేశానికి చేరుకుంటారనే భరోసా తల్లిదండ్రులకు వచ్చింది. ఈ దశలో భారత్ కు చెందిన ఓ వైద్య విద్యార్థి ఉక్రెయిన్ లో దుర్మరణం పాలయ్యారు. రష్యా దాడుల్లో ప్రాణం కోల్పోయారు.

ఖార్కివ్‌ లో జరిగిన దాడుల్లో కర్నాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్‌ మృతిచెందారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఈ మరణాన్ని ధృవీకరించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నవీన్ ఖార్కివ్‌ నేషనల్ మెడికల్‌ యూనివర్శిటీలో నాలుగో ఏడాది మెడిసిన్ చదువుతున్నారు. ఖార్కివ్‌ లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడగా, అవి గురితప్పి సమీపంలోని జనావాసాలపై పడ్డాయి. ఈ బాంబు దాడిలో నవీన్ సహా మరికొందరు ఉక్రెయిన్ దేశీయులు మృతి చెందారు.

ఈ ఘటన నేపథ్యంలో భారత్‌ లోని ఉక్రెయిన్‌, రష్యా రాయబారులతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఖార్కివ్‌ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా సమీప ప్రాంతాల్లో బాంబు దాడులు ఎక్కువగా జరుగుతుండటంతో.. వెంటనే అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు చేస్తూనే ఉంది. రైళ్లు, ఇతర రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నవారు.. రొమేనియా ద్వారా భారత్ కు చేరుకుంటున్నారు. అనుకోకుండా భారత విద్యార్థి మృతి చెందడం ఆందోళనకు దారితీసింది.

First Published:  1 March 2022 10:17 AM GMT
Next Story