Telugu Global
Cinema & Entertainment

వారియర్ నుంచి 'గురు' వచ్చాడు

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ ఆది పినిశెట్టి […]

వారియర్ నుంచి గురు వచ్చాడు
X

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు.

తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ ఆది పినిశెట్టి పాపులర్. డిఫరెంట్ స్టోరీలు, క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్‌లో దూసుకు వెళ్తున్నారు.’ది వారియర్’లో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ చూస్తే… రాక్షసత్వానికి ప్రతీకగా అనిపిస్తోంది. క్యారెక్టర్ కోసం లుక్, స్టయిలింగ్ మార్చారు. ప్రేక్షకులను ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ‘సరైనోడు’ తర్వాత ఆది పినిశెట్టికి విలన్ పాత్రలు చాలా వచ్చినప్పటికీ ‘నో’ చెప్పాడు. వారియర్ లో గురు పాత్ర గురించి చెప్పిన వెంటనే అంగీకరించారు.

రామ్, ఆది మధ్య సన్నివేశాలు నువ్వా – నేనా అన్నట్టు ఉంటాయంటున్నాడు దర్శకుడు లింగుసామి. గురు క్యారెక్టర్ స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌ అనేలా, ప్రేక్షకులు అందరూ మాట్లాడుకునేలా ఉంటుందంటున్నాడు. ‘సరైనోడు’లో ఆయన చేసిన పాత్ర కంటే పదింతలు ప‌వ‌ర్‌ఫుల్‌గా గురు పాత్ర ఉంటుందట.

ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఆర్జే విజిల్ మహాలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తోంది. ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. మరో కీలక పాత్రలో అక్షరా గౌడ కనిపించనుంది.

First Published:  1 March 2022 9:23 AM GMT
Next Story