Telugu Global
NEWS

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కేసీఆర్ ని నిలబెడతాయా..?

తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధణలో, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కేసీఆర్ సొంత వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా.. ఆయన ఎవరిమాటా వినేవారు కాదంటారు. అందుకే తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలామంది ఆయనకు దూరం జరిగారు. కానీ ఇప్పుడు తొలిసారిగా కేసీఆర్ కేంద్ర రాజకీయాల విషయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఏవైపు ఉంటే ఆ జట్టు విజయం సాధిస్తుందనే ప్రచారం దేశవ్యాప్తంగా ఉంది. అయితే స్వతహాగా రాజకీయ […]

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కేసీఆర్ ని నిలబెడతాయా..?
X

తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధణలో, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కేసీఆర్ సొంత వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా.. ఆయన ఎవరిమాటా వినేవారు కాదంటారు. అందుకే తెలంగాణ సాధించుకున్న తర్వాత చాలామంది ఆయనకు దూరం జరిగారు. కానీ ఇప్పుడు తొలిసారిగా కేసీఆర్ కేంద్ర రాజకీయాల విషయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఏవైపు ఉంటే ఆ జట్టు విజయం సాధిస్తుందనే ప్రచారం దేశవ్యాప్తంగా ఉంది. అయితే స్వతహాగా రాజకీయ నాయకుడిగా విఫలమైన ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాలివ్వడానికే పరిమితం అయ్యారు, అవుతున్నారు కూడా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం తర్వాత తన వ్యూహాలకు కాస్త విరామం ప్రకటించిన పీకే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జట్టు కట్టారు.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్, ముందుగా పీకే సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు వారి మధ్య దాదాపు 8గంటల సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనే అతి పెద్ద టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. అయితే కేవలం 17 లోక్ సభ సీట్లున్న తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్, ఓ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కి, ఢిల్లీ గద్దెనెక్కడం అంత సులభమైన వ్యవహారం కాదు. అందుకే ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకి, ముందుగానే ఆ కూటమిపై పట్టుకోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే ప్రశాంత్ కిషోర్ తో సమాలోచనలు జరుపుతున్నారు.

చేతకాకనే కిషోర్ సాయం..
ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ భేటీని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కేసీఆర్ కి చేతగాకనే కిషోర్ ని తెచ్చుకున్నారని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రగతి భవన్‌ ను అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని చెప్పారు. దమ్ముంటే 24 గంటల్లో ప్రభుత్వాన్ని రద్దు చెయ్యాలని.. ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సీఎం కేసీఆర్‌ కు సవాల్‌ విసిరారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయే కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తారన్నారు.

First Published:  27 Feb 2022 11:14 PM GMT
Next Story