Telugu Global
Cinema & Entertainment

మార్చి 1న 'రామారావు' ఎంట్రీ

ఖిలాడీ సినిమా థియేటర్లలోకి వచ్చింది, వెళ్లింది. ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన తదుపరి సినిమా పనిలో పడ్డాడు. అదే రామారావు ఆన్ డ్యూటీ. మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. `రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ లాంచ్ […]

మార్చి 1న రామారావు ఎంట్రీ
X

ఖిలాడీ సినిమా థియేటర్లలోకి వచ్చింది, వెళ్లింది. ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన తదుపరి సినిమా పనిలో పడ్డాడు. అదే రామారావు ఆన్ డ్యూటీ. మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

'రామారావు ఆన్ డ్యూటీ'సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా చక్కర్లు కొడుతోంది

వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. ఇది యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

First Published:  27 Feb 2022 6:43 AM GMT
Next Story