Telugu Global
NEWS

జిల్లాల విభజనలో మరో ముందడుగు.. మార్చి 11నాటికి ఉద్యోగుల కేటాయింపు..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎక్కడా ఈ ప్రక్రియ ఆలస్యమైంది లేదు. ముందు అనుకున్న ముహూర్తానికి కొత్త జిల్లాల నుంచి పాలన మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 2న జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన అపాయింటెడ్ డే గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 11నాటికి ఉద్యోగుల కేటాయింపు.. ప్రస్తుతానికి పోలీస్ శాఖ మినహా.. మిగతా […]

జిల్లాల విభజనలో మరో ముందడుగు.. మార్చి 11నాటికి ఉద్యోగుల కేటాయింపు..
X

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఎక్కడా ఈ ప్రక్రియ ఆలస్యమైంది లేదు. ముందు అనుకున్న ముహూర్తానికి కొత్త జిల్లాల నుంచి పాలన మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 2న జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన అపాయింటెడ్ డే గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

మార్చి 11నాటికి ఉద్యోగుల కేటాయింపు..
ప్రస్తుతానికి పోలీస్ శాఖ మినహా.. మిగతా శాఖల్లో ఉద్యోగుల కేటాయింపు మొదలవుతోంది. మార్చి 11నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు పూర్తవుతుందని తెలిపారు అధికారులు. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్‌ ఫామ్‌ లు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ జాబితా విడుదల చేస్తూ ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేస్తారు అధికారులు. ఆ తర్వాత బదిలీలపై ఆంక్షలు సడలిస్తారు. తాత్కాలికంగా జరిగే ఈ కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్‌, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేశారు అధికారులు. జిల్లా, డివిజన్‌ స్థాయిలోని ఉద్యోగులను మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కొత్త జిల్లాలకు కేటాయిస్తారని తెలుస్తోంది.

అభ్యంతరాలను పక్కనపెట్టినట్టేనా..?
ఇప్పటి వరకు కొన్ని చోట్ల జిల్లాల పునర్విభజన పట్ల అభ్యంతరాలు వచ్చాయి. పేరు మార్చాలని కొందరు, జిల్లా కేంద్రాన్నే మార్చాలని ఇంకొందరు, నియోజకవర్గాలను అటు ఇటు మార్చాలంటూ మరికొందరు కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. అధికార పార్టీనుంచి కూడా కీలక నేతలు నియోజకవర్గాల విషయంలో పట్టుబడుతున్నారు. అయితే వీటి విషయంలో కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. తీవ్ర స్థాయిలో అభ్యంతరాలుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే జిల్లాల సరిహద్దులు నిశ్చయం అయిపోయినట్టు తెలుస్తోంది. పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. మొత్తమ్మీద అపాయింటెడ్ డే కూడా నిర్ణయించారు కాబట్టి.. ఏప్రిల్ 2న కొత్త జిల్లాలకు మహూర్తం ఫిక్స్ అయిపోయినట్టే.

First Published:  27 Feb 2022 5:32 AM GMT
Next Story