Telugu Global
Cinema & Entertainment

గంగూభాయ్ కోసం అలియా ఏం చేసింది?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మరి ఈ పాత్ర కోసం అలియా భట్ ఎలా ప్రిపేర్ అయింది, ఎంత కష్టపడింది? “నేను కొంచెం స‌న్న‌గా ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత […]

గంగూభాయ్ కోసం అలియా ఏం చేసింది?
X

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మరి ఈ పాత్ర కోసం అలియా భట్ ఎలా ప్రిపేర్ అయింది, ఎంత కష్టపడింది?

“నేను కొంచెం స‌న్న‌గా ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత బేస్ ఉండ‌దు. దాని కోసం గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసాను. మంచి ఫుడ్ తిన్నాను. పాత్రకు త‌గ్గ‌ట్టుగా ఈ రెండు మార్చుకోవ‌డం కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఫ‌స్ట్‌టైమ్‌ కథియావాడీ సెట్ లోకి అడుగుపెట్టాకే తెలిసింది. ఇలా వుంటుదీ అని. అక్కడ నుంచి మెలమెల్లగా ఆ పాత్రలోకి మారడం మొదలుపెట్టాను. నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది దర్శకుడే. ఒక దశలో ఇంటికి వెళ్లాక కూడా గంగూ భాయ్ పాత్ర నన్ను వెంటాడేది. గంగూభాయ్ పాత్రను అలా మలిచిన క్రెడిట్ అంతా ఆయనదే.”

ఇలా గంగూభాయ్ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయిందో వెల్లడించింది అలియా భట్. గంగూభాయ్ సినిమాలో అజయ్ దేవగన్ తో కలిసి నటించడం మంచి అనుభవమని, ఆయనను చూసి ప్రొఫెషనల్ గా ఉండడం నేర్చుకున్నానని తెలిపింది అలియా.

First Published:  20 Feb 2022 10:03 AM GMT
Next Story