Telugu Global
NEWS

టీటీడీ కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం.. 

కరోనా ప్రభావం తగ్గుతున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం ఇందులో ముఖ్యమైనది. అదే సమయంలో కొండపైన అన్నిచోట్లా అన్నప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా కారణంగా కేవలం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోనే ఇప్పటి వరకూ అన్నప్రసాదం అందిస్తూ వచ్చారు. ఇకపై గతంలో లాగా క్యూలైన్లలో కూడా అన్నప్రసాదం వితరణ చేస్తారు. తిరుమలలోని మిగతా అన్ని ప్రముఖ […]

టీటీడీ కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం.. 
X
కరోనా ప్రభావం తగ్గుతున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం ఇందులో ముఖ్యమైనది. అదే సమయంలో కొండపైన అన్నిచోట్లా అన్నప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా కారణంగా కేవలం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోనే ఇప్పటి వరకూ అన్నప్రసాదం అందిస్తూ వచ్చారు. ఇకపై గతంలో లాగా క్యూలైన్లలో కూడా అన్నప్రసాదం వితరణ చేస్తారు. తిరుమలలోని మిగతా అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదం ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ఆర్జిత సేవల ధరల పెంపు..
కరోనా తర్వాత ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించడంతోపాటు.. సేవా టికెట్ల ధరలను కూడా పెంచేందుకు టీటీడీ నిర్ణయించింది. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండ్రోజుల్లో ప్రకటన వెలువడుతుంది. రూ. 230 కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 2.73 కోట్లతో స్విమ్స్‌ ఆసుపత్రి ఆధునీకరణకు కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్యం కోసం రూ.25కోట్లు కేటాయించారు. తిరుమలలోని అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అన్నమయ్య మార్గం ఏర్పాటుకి ప్రణాళిక..
తిరుమల కొండకు చేరుకోడానికి రెండు నడకదారులు, రెండు రోడ్డు మార్గాలే కాకుండా.. అన్నమయ్య మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తామని గతంలో టీటీడీ ప్రకటించింది. వీలైనంత త్వరగా అన్నమయ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తాజాగా స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అటవీశాఖ అనుమతి వచ్చేలోగా తాత్కాలిక పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం అన్నమయ్య మార్గం ద్వారా కొంతమంది భక్తులు కొండకు వస్తున్నారని వారికి ఇబ్బంది లేకుండా నడకదారి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మహాద్వారం, ఆనంద నిలయం, బంగారు వాకిలికి బంగారు తాపడంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతి విషయానికొస్తే.. తిరుపతి సైన్స్‌సెంటర్‌ భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది టీటీడీ. 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేయబోతున్నారు.
First Published:  17 Feb 2022 7:49 AM GMT
Next Story