Telugu Global
National

భారత్ లో అన్ని గ్రామాలకు డిజిటల్ మ్యాప్ లు..

స్వమిత్వ పేరుతో భారత్ లో అన్ని గ్రామాల సమాచారాన్ని, గ్రామాల మ్యాప్ లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ జోరందుకుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 1,08,337 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. వీటిల్లో 77,716 గ్రామాల మ్యాప్ లను ఆయా రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. 84,14,055 ప్రాంతాలకు చెందిన సమాచారాన్నంతా డిజిటల్ రూపంలో భద్రపరుస్తోంది. మొత్తం 6 లక్షల గ్రామాలకు మ్యాప్ లు.. భారత్ లో మొత్తం 6లక్షల గ్రామాలకు డిజిటల్ […]

భారత్ లో అన్ని గ్రామాలకు డిజిటల్ మ్యాప్ లు..
X

స్వమిత్వ పేరుతో భారత్ లో అన్ని గ్రామాల సమాచారాన్ని, గ్రామాల మ్యాప్ లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ జోరందుకుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 1,08,337 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. వీటిల్లో 77,716 గ్రామాల మ్యాప్ లను ఆయా రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. 84,14,055 ప్రాంతాలకు చెందిన సమాచారాన్నంతా డిజిటల్ రూపంలో భద్రపరుస్తోంది.

మొత్తం 6 లక్షల గ్రామాలకు మ్యాప్ లు..
భారత్ లో మొత్తం 6లక్షల గ్రామాలకు డిజిటల్ మ్యాప్ లు తయారు చేసేందుకు స్వమిత్వ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కేంద్రం. 100 పట్టణాలకు కూడా డిజిటల్ మ్యాప్ లు తయారు చేయాల్సి ఉంది. 2020 ఏప్రిల్ లో ప్రధాని నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహకారంతో డిజటలైజేషన్ కొనసాగుతోంది.

డిజిటలైజేషన్ వల్ల ఉపయోగాలు ఇవీ..
స్వమిత్వ పేరుతో మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ఫారెస్ట్ మేనేజ్ మెంట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, నీటి సరఫరా, ఆదాయ పన్ను, భూమి రికార్డులు.. ఇతరత్రా వ్యవహారాల్లో ఉపయోగాలుంటాయని చెబుతోంది కేంద్రం. భూ హక్కు పత్రాలను యజమానులకు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఈ డిజిటల్ మ్యాప్ ల ద్వారా క్లియర్ ఓనర్ షిప్ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్ల వాడకం ద్వారా మరింత వేగంగా డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

First Published:  16 Feb 2022 12:24 AM GMT
Next Story