Telugu Global
National

ఆంక్షల వలయం నుంచి బయటపడుతున్న తమిళనాడు..

కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకంటే తమిళనాడులో ఎక్కువగా ఆంక్షలు విధించారు సీఎం స్టాలిన్. నైట్ కర్ఫ్యూతోపాటు, ఆదివారం రోజు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అన్నారు. కానీ ఇప్పుడా నిబంధనలన్నీ తొలగించారు. కేసులు తగ్గుతున్న వేళ తమిళనాడుకి ఆంక్షల చక్రబంధనం నుంచి విముక్తి లభిస్తోంది. ఈనెల 16 నుంచి ఆంక్షల ఎత్తివేత.. తమిళనాడులో రోజువారీ కేసులు ఓ దశలో […]

ఆంక్షల వలయం నుంచి బయటపడుతున్న తమిళనాడు..
X

కరోనా థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకంటే తమిళనాడులో ఎక్కువగా ఆంక్షలు విధించారు సీఎం స్టాలిన్. నైట్ కర్ఫ్యూతోపాటు, ఆదివారం రోజు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అన్నారు. కానీ ఇప్పుడా నిబంధనలన్నీ తొలగించారు. కేసులు తగ్గుతున్న వేళ తమిళనాడుకి ఆంక్షల చక్రబంధనం నుంచి విముక్తి లభిస్తోంది.

ఈనెల 16 నుంచి ఆంక్షల ఎత్తివేత..
తమిళనాడులో రోజువారీ కేసులు ఓ దశలో 25వేలు దాటాయి. ఇప్పుడు కేసుల సంఖ్య 3వేలకు పరిమితం అవుతోంది. దీంతో తమిళనాడులో ఆంక్షలను ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు అనుమతులిచ్చారు. ఈనెల 16నుంచి కిండర్ గార్టెన్, ప్లే స్కూల్స్ కి కూడా అనుమతులిస్తున్నారు. సినిమా థియేట‌ర్లు, హోట‌ళ్లు, మాల్స్‌, బట్టలు, జ్యువెల‌రీ దుకాణాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో న‌డిపించుకోవ‌చ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుభ, అశుభ కార్యాలకు హాజరయ్యే అతిథుల సంఖ్యపై ఉన్న ఆంక్షలను సడలించింది.

నైట్ కర్ఫ్యూని పూర్తిగా తొలగిసిస్తున్నట్టు ప్రకటించారు సీఎం స్టాలిన్. ఇకపై ఆదివారాల్లో ఉన్న లాక్ డౌన్ కూడా పూర్తి స్థాయిలో ఎత్తేస్తున్నారు. పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది, సినిమా థియేటర్లలో ఫిఫ్టీపర్సెంట్ ఆక్యుపెన్సీ నిబంధన అమలవుతోంది. అయితే తమిళనాడు కాస్త ముందుగానే ఆంక్షలను సడలించింది. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో అందరికంటే ముందుగా కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చిన స్టాలిన్, కేసుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు సడలింపులపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మార్చి 2 వరకు మినహాయింపులు కాకుండా ఇతర విషయాల్లో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

First Published:  13 Feb 2022 8:41 PM GMT
Next Story