Telugu Global
Cinema & Entertainment

డీజే టిల్లు మొదటి రోజు వసూళ్లు

థియేటర్లలో రిలీజైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీజే టిల్లూ వసూళ్లలో కూడా తన మార్క్ చూపించాడు. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ అంచనాకు మించి, 40శాతం అధికంగా వసూళ్లు రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా తొలి రోజే బ్రేక్ ఈవెన్ అయింది. కోటి 54 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్ లో […]

డీజే టిల్లు మొదటి రోజు వసూళ్లు
X

థియేటర్లలో రిలీజైన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీజే టిల్లూ వసూళ్లలో కూడా తన మార్క్ చూపించాడు. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ అంచనాకు మించి, 40శాతం అధికంగా వసూళ్లు రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

నైజాంలో ఈ సినిమా తొలి రోజే బ్రేక్ ఈవెన్ అయింది. కోటి 54 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లతో ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయింది. ఏపీలో ఈ సినిమాకు కోటి 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 1.54 కోట్లు
సీడెడ్ – 50 లక్షలు
ఉత్తరాంధ్ర – 26 లక్షలు
ఈస్ట్ – 18 లక్షలు
వెస్ట్ – 14 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
నెల్లూరు – 10 లక్షలు
కృష్ణా – 11 లక్షలు

First Published:  13 Feb 2022 6:51 AM GMT
Next Story