Telugu Global
NEWS

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల..

థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోతుందనుకుంటున్న వేళ.. ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా వల్ల తరగతులు ఆలస్యం కావడం, సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడంతో టెన్త్ పరీక్షలు కాస్త వెనక్కు వెళ్లాయి. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షల్ని పూర్తి చేసి, ఆ తర్వాత టెన్త్ పరీక్షలు మొదలుపెట్టడానికి నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 11 నుంచి […]

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల..
X

థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోతుందనుకుంటున్న వేళ.. ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా వల్ల తరగతులు ఆలస్యం కావడం, సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడంతో టెన్త్ పరీక్షలు కాస్త వెనక్కు వెళ్లాయి. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షల్ని పూర్తి చేసి, ఆ తర్వాత టెన్త్ పరీక్షలు మొదలుపెట్టడానికి నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి షెడ్యూల్ ప్రకటించారు.

మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1456 పరీక్షా కేంద్రాలను ఇంటర్ పరీక్షలకోసం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,05,052 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,81,481 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.

మేలో టెన్త్ పరీక్షలు..
మే 2 నుంచి మే 13 వరకు టెన్త్‌ పరీక్షలు జరుగుతాయని మంత్రులు ప్రకటించారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడినా.. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు మంత్రులు.

First Published:  10 Feb 2022 8:41 AM GMT
Next Story