Telugu Global
Cinema & Entertainment

రీతూ వర్మ నుంచి మరో డిఫరెంట్ మూవీ

తను ప్లాన్ చేసుకుంటుందా, లేక అలాంటి కథలే వస్తున్నాయో చెప్పలేం కానీ.. కెరీర్ స్టార్టింగ్ నుంచి రీతూ వర్మది డిఫరెంట్ దారి. ఆమె అంగీకరించే సినిమాలన్నీ కాస్తోకూస్తో ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న ఓ సినిమా కూడా అలాంటి ప్రత్యేకమైన సినిమానే. అదే ఆకాశం. అశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళంలో ‘నిత్తమ్‌ ఒరు వానమ్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘ఆకాశం’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. క్లీన్‌ […]

రీతూ వర్మ నుంచి మరో డిఫరెంట్ మూవీ
X

తను ప్లాన్ చేసుకుంటుందా, లేక అలాంటి కథలే వస్తున్నాయో చెప్పలేం కానీ.. కెరీర్ స్టార్టింగ్ నుంచి రీతూ వర్మది డిఫరెంట్ దారి. ఆమె అంగీకరించే సినిమాలన్నీ కాస్తోకూస్తో ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న ఓ సినిమా కూడా అలాంటి ప్రత్యేకమైన సినిమానే. అదే ఆకాశం.

అశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళంలో ‘నిత్తమ్‌ ఒరు వానమ్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘ఆకాశం’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. క్లీన్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌ని తెరకెక్కించాలనే సంకల్పంతో ఉన్న రైస్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు వయకామ్ నిర్మాతలు.

ప్రతి సినిమాతోనూ తన కెరీర్‌ గ్రాఫ్‌ని పైపైకి ఎదిగేలా చూసుకుంటున్న రీతూవర్మ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కనుంది. కార్తీక్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శివాత్మిక రాజశేఖర్‌ కూడా నటించింది. వీరితో పాటు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

తెలుగులో ఆకాశం, తమిళ్‌లో నిత్తమ్‌ ఒరు వానమ్‌ అనే టైటిల్‌ని దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. తెలుగు, తమిళ్‌లో ఒకేసారి తెరకెక్కించిన చిత్రమిది. చెన్నై, హైదరాబాద్‌, మనాలి, వైజాగ్‌, గోవా, ఢిల్లీ, చండీఘడ్‌, కోల్‌కతా, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. గోపీసుందర్‌ సంగీతం అందించాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  8 Feb 2022 10:55 AM GMT
Next Story