Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్ బరి నుంచి సూర్య మూవీ ఔట్

భారతీయుల కలల్ని, ఆశల్ని, అంచనాల్ని ఆస్కార్ వేదికపై మోసుకెళ్లిన జై భీమ్ సినిమా ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం అందించింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ బరి నుంచి తప్పుకుంది. అయితే ఆఖరి నిమిషం వరకు పోటీనిచ్చి, ప్రపంచస్థాయిలో గుర్తింపు అందుకుంది ఈ చిత్రరాజం. అన్యాయానికి గురైన ఓ సగటు గిరిజన యువతి కోసం ఓ లాయర్ చేసిన పోరాటమే జై భీమ్. యదార్థ ఘటనల ఆధారంగా, అత్యంత సహజంగా తీసిన ఈ […]

ఆస్కార్ బరి నుంచి సూర్య మూవీ ఔట్
X

భారతీయుల కలల్ని, ఆశల్ని, అంచనాల్ని ఆస్కార్ వేదికపై మోసుకెళ్లిన జై భీమ్ సినిమా ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం అందించింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ బరి నుంచి తప్పుకుంది. అయితే ఆఖరి నిమిషం వరకు పోటీనిచ్చి, ప్రపంచస్థాయిలో గుర్తింపు అందుకుంది ఈ చిత్రరాజం.

అన్యాయానికి గురైన ఓ సగటు గిరిజన యువతి కోసం ఓ లాయర్ చేసిన పోరాటమే జై భీమ్. యదార్థ ఘటనల ఆధారంగా, అత్యంత సహజంగా తీసిన ఈ సినిమాకు ఇండియా మొత్తం సలాం కొట్టింది. నేరుగా ఓటీటీలో రిలీజైంది కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకు తెలియలేదు కానీ, థియేటర్లలో వచ్చి ఉంటే జైభీమ్ సినిమా ఓ ఊపు ఊపేసి ఉండేది. ఓటీటీలో రిలీజైనప్పటికీ, అందరి మన్ననలు అందుకొని, ఆస్కార్ వేదిక వరకు వెళ్లిందంటే అది ఆ సినిమా కంటెంట్ మహత్యం.

జై భీమ్ ఆస్కార్ బరి నుంచి తప్పుకోవడంతో సూర్య అభిమానులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య సినిమాలోని ఓ డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. “మనం ప్రయత్నించామా లేదా, అదే ముఖ్యం.” అంటూ సూర్య ఉద్వేగభరితంగా చెప్పే ఓ సినిమా డైలాగ్ క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజమే.. సినిమాలో భీమ్ పాత్రలో సూర్య ఎలాగైతే ఫైట్ చేశాడో, ఆస్కార్ బరిలో కూడా అదే పోరాటాన్ని చూపించాడు. ఈ సినిమాను ప్రపంచం గుర్తించేలా చేశాడు.

ఉత్తమ విదేశీ చిత్రంలో 10 సినిమాలు నామినేట్ అవ్వగా, అందులో జై భీమ్ కు స్థానం దక్కలేదు. ఇక ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో జపాన్, డెన్మార్క్, ఇటలీ, భూటాన్, నార్వే దేశాలకు చెందిన సినిమాలు ఎంపిక కాగా.. ఇండియాకు స్థానం దక్కలేదు.

First Published:  8 Feb 2022 10:58 AM GMT
Next Story