Telugu Global
National

మోదీ పేరు మరచిన కేజ్రీ.. అసలు కారణం ఇదే..!

ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చేవారు. షేమ్ లెస్ డిక్టేటర్ అంటూ ఘాటుగా విమర్శలు చేసేవారు. కానీ కొన్నాళ్లుగా కేజ్రీవాల్.. మోదీని మరచిపోయారు. మోదీని కేజ్రీవాల్ నేరుగా టార్గెట్ చేసి దాదాపు […]

మోదీ పేరు మరచిన కేజ్రీ.. అసలు కారణం ఇదే..!
X

ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చేవారు. షేమ్ లెస్ డిక్టేటర్ అంటూ ఘాటుగా విమర్శలు చేసేవారు. కానీ కొన్నాళ్లుగా కేజ్రీవాల్.. మోదీని మరచిపోయారు. మోదీని కేజ్రీవాల్ నేరుగా టార్గెట్ చేసి దాదాపు రెండేళ్లవుతుందని ఓ ఆసక్తికర సర్వే తేల్చింది. కనీసం కేజ్రీవాల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా మోదీ పేరుతో ఇటీవల ఒక్క ట్వీట్ కూడా పడలేదు.

టార్గెట్ మోదీ కాదు.. టార్గెట్ బీజేపీ..
మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటున్నారట కేజ్రీవాల్. అందుకే ఆయన పేరుని పక్కనపెట్టి, బీజేపీ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ని కూడా అదే గాటన కట్టేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ని కాదని ఆమ్ ఆద్మీకి ప్రజలు పట్టం కట్టే అవకాశముందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే తేల్చింది. ప్రీపోల్ సర్వేలు అనుకూలంగా ఉండటంతో కేజ్రీవాల్ మరింత దూకుడు పెంచారు.

హామీల్లో మొనగాడు..
గృహిణులందరికీ ఆర్థిక సాయం, నిరుద్యోగులకు భృతి, విద్యార్థినులకు సౌకర్యాలు.. ఇలా హామీలివ్వడంలో కేజ్రీవాల్ తనకు తిరుగులేదని అనిపించుకుంటున్నారు. ఉచిత హామీలతో ఆయన కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా తెరపైకి రావాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వారంతా కాంగ్రెస్ కి కూడా దూరం జరుగుతున్నారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీలను విస్తరిస్తుంటే.. కేసీఆర్, స్టాలిన్.. బీజేపీ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూటములు కట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ దశలో సొంత బలం పెంచుకోడానికి కేజ్రీవాల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  7 Feb 2022 11:54 PM GMT
Next Story