Telugu Global
Cinema & Entertainment

మహేష్ మెచ్చిన 'కళావతి' వచ్చేస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోంది. ఇది కచ్చితంగా […]

మహేష్ మెచ్చిన కళావతి వచ్చేస్తోంది
X

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు.

సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడతారట.

మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నాడు దర్శకులు పరుశురాం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ పాటతో సర్కారువారి పాట ప్రమోషన్ అధికారికంగా ప్రారంభం కాబోతోంది. ఇకపై సర్కారువారి పాట నుంచి మినిమం గ్యాప్స్ లో అప్ డేట్స్ వస్తాయని మేకర్స్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

First Published:  7 Feb 2022 10:00 AM GMT
Next Story