Telugu Global
Cinema & Entertainment

సెబాస్టియన్ మూవీ టీజర్ రివ్యూ

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమై, కంటెంట్‌ ఉన్న కుర్రాడనిపించుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. క్లాసు-మాసు, యూత్-ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ […]

సెబాస్టియన్ మూవీ టీజర్ రివ్యూ
X

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమై, కంటెంట్‌ ఉన్న కుర్రాడనిపించుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. క్లాసు-మాసు, యూత్-ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘సెబాస్టియన్ పిసి 524’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

‘నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!’ అని తల్లి చెప్పే మాటతో ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ మొదలైంది. సినిమాలో హీరోకి రేచీకటి అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. ‘పేరు ఏమో క్రిస్టియన్ లాగా ఉండాది. వచ్చింది ఏమో గుడి కాడనుండా’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ వింటుంటే… హీరోకి భక్తి ఉందని తెలుస్తోంది.

రేచీకటి గల హీరో నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది. ‘దయగల ప్రభువా… ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం’, ‘నేను దేవుడి బిడ్డను కాదన్నమాట’ అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. ఈ సినిమాతో మరో సక్సెస్ పై కన్నేశాడు కిరణ్. ఈనెల 24న థియేటర్లలోకి వస్తున్నాడు సెబాస్టియన్.

First Published:  5 Feb 2022 8:09 AM GMT
Next Story