ఫ్లాపులపై స్పందించిన మహేష్ బాబు
ప్రతి హీరోకు ఫ్లాపులు సహజం. హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోవడం కూడా అంతే సహజం. ఈ అంశంపై హీరో మహేష్ బాబు స్పందించాడు. తను కూడా అందరిలాంటి వాడినేనని, ఫ్లాప్ వచ్చినప్పుడు తనకు కూడా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తను నటించిన సినిమా సరిగ్గా ఆడకపోతే 2-3 రోజులు గది నుంచి బయటకు రాడంట మహేష్. సినిమా ఫ్లాప్ ను డైరక్టర్ లేదా మరో వ్యక్తిపై తోసేయడం తనకు ఇష్టం ఉండదంటున్నాడు మహేష్. తన […]

ప్రతి హీరోకు ఫ్లాపులు సహజం. హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోవడం కూడా అంతే సహజం. ఈ అంశంపై హీరో మహేష్ బాబు స్పందించాడు. తను కూడా అందరిలాంటి వాడినేనని, ఫ్లాప్ వచ్చినప్పుడు తనకు కూడా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తను నటించిన సినిమా సరిగ్గా ఆడకపోతే 2-3 రోజులు గది నుంచి బయటకు రాడంట మహేష్.
సినిమా ఫ్లాప్ ను డైరక్టర్ లేదా మరో వ్యక్తిపై తోసేయడం తనకు ఇష్టం ఉండదంటున్నాడు మహేష్. తన సినిమా ఫ్లాప్ కు పూర్తిగా తనదే బాధ్యత అంటున్నాడు. నిర్మాత డబ్బులు పోయినందుకు చాలా బాధపడతానని, తను ఆ కథకు ఓకే చెప్పకుండా ఉన్నట్టయితే నిర్మాతకు డబ్బులు మిగిలేవి కదా అనే కోణంలో ఆలోచిస్తానంటున్నాడు.
అయితే ఫ్లాపుల నుంచే తను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పటి తన సక్సెస్ కు ఒకప్పటి ఫ్లాపులే కారణం అని తెలిపాడు. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు మహేష్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తన కథల్ని తానే విన్నాడట. కనీసం కెరీర్ స్టార్టింగ్ లో కూడా తన తండ్రి కృష్ణకు కథలు వినిపించలేదని, నమ్రత ప్రమేయం అస్సలు ఉండదని స్పష్టం చేశాడు మహేష్. భవిష్యత్తులో తన కొడుకు గౌతమ్ ను కూడా ఇలానే పెంచుతానని, గౌతమ్ కు తన సపోర్ట్ అస్సలు ఉండదని అంటున్నాడు మహేష్.