Telugu Global
Cinema & Entertainment

చెప్పిన తేదీకే రవితేజ సినిమా

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా రోజుల క్రితమే లాక్ అయింది. ఫిబ్రవరి 11న సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు పోస్టర్స్ మీద అదే డేట్ వేస్తూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యుయల్ రోల్ లో […]

చెప్పిన తేదీకే రవితేజ సినిమా
X

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా రోజుల క్రితమే లాక్ అయింది. ఫిబ్రవరి 11న సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు పోస్టర్స్ మీద అదే డేట్ వేస్తూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు మేకర్స్.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా చెప్పినట్లే అదే తేదీకి అంటే మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల ఖిలాడీగా ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ వచ్చే నెలలో లేదా ఏప్రిల్ లో రామారావు తో ఎక్కువ గ్యాప్ లేకుండానే థియేటర్స్ లోకి వస్తున్నాడు.

ఖిలాడి పోస్ట్ పోన్ చేయకుండా ప్రకటించిన డేట్ కే రావడానికి రవితేజ నెక్స్ట్ సినిమా రామారావు ఆన్ డ్యూటీ కూడా ఒక కారణం. అందుకే మేకర్స్ అనుకున్న తేదీకి రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. మరి ఖిలాడితో రవితేజ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి. A-స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. రవితేజ సరసన డింపుల్ హైయతి , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

First Published:  2 Feb 2022 11:21 AM GMT
Next Story