Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాధేశ్యామ్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలా అందరి అంచనాల్ని మరింత పెంచుతూ, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మార్చి […]

Radhe Shyam Movie
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలా అందరి అంచనాల్ని మరింత పెంచుతూ, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మార్చి 11న రాధేశ్యామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సినిమాలోని ముఖ్యమైన అంశాన్ని విజువ‌లైజ్ చేస్తూ సిద్ధం చేసిన ఓ థీమ్ పోస్ట‌ర్ ద్వారా రాధేశ్యామ్ మార్చి 11న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల అవుతున్న‌ట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి రాధే శ్యామ్ సౌత్, నార్త్ వెర్షన్స్‌కు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఇలా విజువల్ ఫీస్ట్ గా, టెక్నికల్ వండర్ గా థియేటర్లలోకి రాబోతోంది రాధేశ్యామ్ సినిమా. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకుడు.

First Published:  2 Feb 2022 11:09 AM GMT
Next Story