Telugu Global
Cinema & Entertainment

పక్కా సిరివెన్నెల మార్క్ తో వచ్చిన సాంగ్

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. గోపీచంద్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల గారు చివరిసారి […]

పక్కా సిరివెన్నెల మార్క్ తో వచ్చిన సాంగ్
X

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. గోపీచంద్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అయ్యాడు.

“పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్..” అనే లిరిక్స్ తో సాగే ఈ పాట పెప్పీగా ఉండడంతో పాటు.. ఎంతో తాత్వికత, భావుకత ఇందులో కనిపిస్తోంది. సిరివెన్నెల మార్క్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యాడు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెలని గుర్తు చేసుకున్నాడు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 20న రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  2 Feb 2022 11:14 AM GMT
Next Story