Telugu Global
NEWS

చింతామణిపై హైకోర్టులో ఆసక్తికర వాదనలు..

ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ నాటకాన్ని నిషేధించొద్దంటూ కళాకారులు, కళా సంఘాల నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. చింతామణి నాటకానికి […]

చింతామణిపై హైకోర్టులో ఆసక్తికర వాదనలు..
X

ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ నాటకాన్ని నిషేధించొద్దంటూ కళాకారులు, కళా సంఘాల నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

చింతామణి నాటకానికి ఓ విశిష్టత ఉందని వందేళ్లుగా కొనసాగుతున్న నాటకాన్ని ఉన్నట్టుండి నిషేధించడం భావ్యం కాదని పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. అయితే ప్రభుత్వానికి ఈ నాటకాన్ని నిషేధించాలంటూ ఓ వర్గం నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందని, దాని ఆధారంగానే నిషేధం విధించాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి వివరించారు.

ఒక్క పాత్ర నచ్చకపోతే..
నాటకంలో ఒక్క పాత్ర నచ్చకపోతే మొత్తం ఆ నాటకాన్ని నిషేధించాలా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించకుండా, కేవలం నాటకాన్ని నిషేధిస్తే అర్థమేముంటుందని అడిగింది. ప్రభుత్వానికి వచ్చిన రిప్రజెంటేషన్ ను కోర్టు ముందుంచాలని కోరింది. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ.. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఆదేశాలిచ్చింది ఏపీ హైకోర్టు.

First Published:  2 Feb 2022 3:57 AM GMT
Next Story