ఆఫ్ఘనిస్తాన్ కు 200కోట్లు.. భూటాన్ కి 2వేల కోట్లు.. కేేంద్ర బడ్జెట్ కేటాయింపులు..
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ఒక్కసారిగా సాయం ఆగిపోయే సరికి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా పతనం అంచుకి చేరింది. తమ దేశంలోని ఆఫ్ఘన్ నిధులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఒకరకంగా అంతర్జాతీయ సమాజంలో ఆ దేశం ఒంటరిగా మారింది. ఇలాంటి సమయంలే భారత్. తాలిబన్ పాలిత ఆఫ్ఘన్ పై ఉదారత చూపిస్తోంది. ఇటీవలే ఆహార పదార్థాలు, వైద్య సాయం కూడా ఆఫ్ఘన్ కి అందించింది భారత్. తాజాగా కేంద్ర […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ఒక్కసారిగా సాయం ఆగిపోయే సరికి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా పతనం అంచుకి చేరింది. తమ దేశంలోని ఆఫ్ఘన్ నిధులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఒకరకంగా అంతర్జాతీయ సమాజంలో ఆ దేశం ఒంటరిగా మారింది. ఇలాంటి సమయంలే భారత్. తాలిబన్ పాలిత ఆఫ్ఘన్ పై ఉదారత చూపిస్తోంది. ఇటీవలే ఆహార పదార్థాలు, వైద్య సాయం కూడా ఆఫ్ఘన్ కి అందించింది భారత్. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఆ దేశంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ లకు 200 కోట్ల రూపాయలు కేటాయించింది. విదేశాంగ శాఖ పరిధిలో ఆయా దేశాలలో చేపట్టబోయే ప్రాజెక్ట్ లకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ వాటా రూ.200కోట్లు.
అత్యధికంగా భూటాన్ కు..
భారత్ నుంచి అత్యంత ఎక్కువ ఆర్థిక ఆసరా పొందుతున్న దేశం భూటాన్. భూటాన్ కోసం భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో 2266.44 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఆ తర్వాత వాటా మారిషస్ ది. మారిషస్ కోసం భారత ప్రభుత్వం తన బడ్జెట్ లో 900కోట్ల రూపాయలు కేటాయించింది. సైనిక తిరుగుబాటు ద్వారా నష్టపోయిన మయన్మార్ కు రూ.600కోట్ల సాయం అందించబోతోంది.
పొరుగు దేశాలైన నేపాల్ కి రూ.750 కోట్లు, బంగ్లాదేశ్ కి రూ.300కోట్లు కేటాయించింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాకు అనూహ్యంగా ఆర్థిక సాయం భారీగా పెంచింది భారత్. గతేడాది 2కోట్ల రూపాయలు సాయం చేయగా ఈసారి మంగోలియా సాయం కోసం 12కోట్ల రూపాయలు కేటాయించారు. ఆఫ్రికాలోని పలు దేశాల్లో భారత విదేశాంగ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది కేంద్రం. అందుకోసం ఆఫ్రికా ఖండానికి 250 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇరుగు పొరుగు దేశాలకు నిధుల కేటాయింపులు వ్యూహాత్మకమే అయినా.. తాలిబన్ చెరలోని ఆఫ్ఘనిస్తాన్ కోసం కూడా భారత్ 200కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.