Telugu Global
National

కేంద్ర మంత్రులు, ఎంపీలతో బీజేపీ ప్రయోగాలు.. ఏమేరకు ఫలితాలు..?

లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సత్తా చూపినా.. ఆమేరకు ఆయా రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ విఫలం అవుతోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికలే దీనికి ప్రధాన ఉదాహరణ. 42 లోక్ సభ స్థానాల పశ్చిమ బెంగాల్ లో 18 ఎంపీ సీట్లను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. సరిగ్గా రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి పోరాటం చేయలేకపోయింది. ఎన్నికల్లో విజయం ఖాయమనుకున్న బీజేపీ.. 294 స్థానాల్లో కేవలం 77 […]

కేంద్ర మంత్రులు, ఎంపీలతో బీజేపీ ప్రయోగాలు.. ఏమేరకు ఫలితాలు..?
X

లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సత్తా చూపినా.. ఆమేరకు ఆయా రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ విఫలం అవుతోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికలే దీనికి ప్రధాన ఉదాహరణ. 42 లోక్ సభ స్థానాల పశ్చిమ బెంగాల్ లో 18 ఎంపీ సీట్లను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. సరిగ్గా రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి పోరాటం చేయలేకపోయింది. ఎన్నికల్లో విజయం ఖాయమనుకున్న బీజేపీ.. 294 స్థానాల్లో కేవలం 77 మాత్రమే సాధించగలిగింది. అయితే ఇక్కడ బీజేపీ ఓ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. గతేడాది జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా నలుగురు ఎంపీలను.. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి దింపింది. అయితే ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది.

యూపీ ఎన్నికల్లో కూడా కేంద్రమంత్రి పోటీ..
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకోసం జాతీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తాయి. కేంద్రంలో కీలక నేతల్ని సీఎం అభ్యర్థులుగా బరిలో దింపుతుంటాయి. అప్పటి వరకు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు.. సడన్ గా అసెంబ్లీ బరిలో దిగుతుంటారు. పశ్చిమబెంగాల్ లో ఈ పాచిక పారకపోయినా ఇప్పుడు యూపీకి కూడా అదే అస్త్రాన్ని బయటకు తీసింది కమలదళం. యూపీలో బీజేపీ తరపున కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అసెంబ్లీ బరిలో దిగారు.

అఖిలేష్ కి పోటీగా..
తొలిసారి సమాజ్ వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ యూపీ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆయనపై పోటీకోసం కేంద్ర మంత్రిని రంగంలోకి దింపింది బీజేపీ. కర్హాల్ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. అఖిలేష్ ని దెబ్బకొట్టేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అయితే కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపి వెస్ట్ బెంగాల్ లో బొక్కబోర్లాపడిన బీజేపీకి యూపీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. కేంద్రంలో పదవి ఉండగా, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఒకవేళ పార్టీ ఒత్తిడితో పోటీ చేసినా, మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనరు. మరి బఘేల్ తో అఖిలేష్ ని ఢీకొట్టడం బీజేపీకి సాధ్యం అవుతుందా..? వెస్ట్ బెంగాల్ లో సీఎం అభ్యర్థి మమతా బెనర్జీని ఓడించినట్టు, యూపీలో కూడా ప్రతిపక్ష పార్టీ సీఎం అభ్యర్థిని బీజేపీ ఓడించగలదా. వేచి చూడాలి.

First Published:  31 Jan 2022 11:13 PM GMT
Next Story