Telugu Global
National

భారతీయులకోసం ఆల్ ఇన్ వన్ డిజిటల్ కార్డ్..

ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా రకరకాల గుర్తింపు కార్డులను అవసరం మేరకు వినియోగిస్తుంటారు ప్రజలు. అన్నిటినీ డిజిటల్ రూపంలో ఫోన్ లో భద్రపరచుకున్నా.. ఒరిజినల్ కార్డ్ చూపించాలనే నిబంధన కొన్ని చోట్ల అమలులో ఉంది. అన్ని కార్డులనూ భద్రపరచుకుని జాగ్రత్తగా వాటిని వాడుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే వాటి స్థానంలో ఆల్ ఇన్ వన్ యునిక్ డిజిటల్ కార్డ్ తీసుకు రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ముసాయిదా సిద్ధం […]

భారతీయులకోసం ఆల్ ఇన్ వన్ డిజిటల్ కార్డ్..
X

ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా రకరకాల గుర్తింపు కార్డులను అవసరం మేరకు వినియోగిస్తుంటారు ప్రజలు. అన్నిటినీ డిజిటల్ రూపంలో ఫోన్ లో భద్రపరచుకున్నా.. ఒరిజినల్ కార్డ్ చూపించాలనే నిబంధన కొన్ని చోట్ల అమలులో ఉంది. అన్ని కార్డులనూ భద్రపరచుకుని జాగ్రత్తగా వాటిని వాడుకోవడం కాస్త కష్టమైన పనే. అందుకే వాటి స్థానంలో ఆల్ ఇన్ వన్ యునిక్ డిజిటల్ కార్డ్ తీసుకు రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ముసాయిదా సిద్ధం చేసింది. ఫిబ్రవరి 27లోగా దీనిపై ప్రజల అభిప్రాయాలను కోరాలని భావిస్తోంది. అన్ని వర్గాలనుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని ముసాయిదాలో మార్పులు చేస్తామని చెబుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలు దాఖలు చేసే సమయంలో, బ్యాంకు సేవలు పొందే సమయంలో, ఇతర అనేక సందర్భాల్లో ఆధార్‌, పాస్‌ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు లాంటి వాటి అవసరం ఉంటుంది. వీటి స్థానంలో ఇకపై కొత్తగా తీసుకొచ్చే యునిక్‌ డిజిటల్‌ ఐడీని వినియోగించవచ్చు. ఈ ఐడీ సాయంతో అన్ని గుర్తింపు కార్డులను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. థర్డ్‌ పార్టీ సర్వీసులు, ఈకేవైసీ కోసం కూడా ఈ డిజిటల్‌ ఐడీని ఉపయోగించవచ్చని కేంద్రం ముసాయిదాలో పేర్కొంది. ఆధార్‌ కార్డు లాగే ఈ డిజిటల్ ఐడీకి కూడా మరో ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు.

ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి కీలక పత్రాల డేటాను నిక్షిప్తం చేసిన యునిక్‌ డిజిటల్‌ కార్డు హ్యాకింగ్‌ కు గురైతే పరిస్థితి ఏమిటని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శక్తిమంతమైన సైబర్‌ దాడులను తట్టుకొని ఈ కార్డు డేటా సురక్షితంగా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. యునిక్‌ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, దాని సెక్యూరిటీ ఫీచర్లపై తగిన కసరత్తు చేసిందో లేదో తేలాల్సి ఉంది. అన్ని సెక్యూరిటీ ఫీచర్లతో డిజిటల్ ఐడీ తెరపైకి వస్తే మాత్రం ఇదో సరికొత్త మార్పుకి శ్రీకారం అనే చెప్పాలి.

First Published:  30 Jan 2022 9:50 PM GMT
Next Story