Telugu Global
NEWS

ముదురుతున్న పీఆర్సీ వివాదం.. క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశం..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 7నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు ఇచ్చారు. అదే సమయంలో రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఈలోగా ఒకటో తేదీ జీతాల బిల్లుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగులంతా iపాత జీతాలే కావాలంటున్నారు, ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు రెడీ చేయాలంటోంది. దీంతో ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఉద్యోగులు మాత్రం కొత్త పీఆర్సీకి ఒప్పుకునేది లేదంటున్నారు. ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణతో పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ […]

ముదురుతున్న పీఆర్సీ వివాదం.. క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశం..
X

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 7నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు ఇచ్చారు. అదే సమయంలో రోజువారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఈలోగా ఒకటో తేదీ జీతాల బిల్లుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగులంతా iపాత జీతాలే కావాలంటున్నారు, ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు రెడీ చేయాలంటోంది. దీంతో ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఉద్యోగులు మాత్రం కొత్త పీఆర్సీకి ఒప్పుకునేది లేదంటున్నారు. ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణతో పీఆర్సీ బిల్లులు ప్రాసెస్ చేసే వ్యవహారం ఆగిపోయింది.

క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి 29 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు జీతాల బిల్లులు సమర్పించని డ్రాయింగ్‌ డిస్‌ బర్స్ మెంట్‌ అధికారులు, వాటిని ప్రాసెస్‌ చేయని సబ్ ట్రెజరీ ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు రెడీ చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చినా, డీడీఓలు, ఎస్టీవోలు సహకరించడంలేదు. ఈపాటికే పూర్తి కావాల్సిన జీతాల ప్రక్రియ ఆగిపోయింది. విధులు నిర్వర్తించనివారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, ట్రెజరీ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.

బిల్లులతోనే మొదలు..
ఉద్యోగులు సమ్మె అంటున్నారు, ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది.. ఫిబ్రవరి 7 లోపు ఈ వ్యవహారం ఎలాగోలా పరిష్కారం అవుతుందనుకుంటున్న సమయంలో మధ్యలో ఒకటో తేదీ రావడంతో జీతాల విషయంలోనే అసలు పీటముడి పడింది. కొత్త పీఆర్సీకోసం ప్రభుత్వం, పాత జీతాల కోసం ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకూ కేవలం లక్షా 17వేల బిల్లులు మాత్రమే డీడీవోలు ట్రెజరీకి పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ట్రెజరీ ఆఫీసర్లంతా ఆదివారం కూడా పని చేసి జీతాల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

First Published:  29 Jan 2022 9:59 PM GMT
Next Story