Telugu Global
NEWS

నెగెటివ్ లేకపోయినా డిశ్చార్జ్ చేసేయొచ్చు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు కోలుకున్న తర్వాత లక్షణాలు లేకపోతే నేరుగా ఇంటికి వెళ్లేలా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. క్లినికల్ మేనేజ్ మెంట్ పై రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ రోగులకు డిశ్చార్జి సమయంలో నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య ఓ దశలో పెరిగినా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం ఆ […]

నెగెటివ్ లేకపోయినా డిశ్చార్జ్ చేసేయొచ్చు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..
X

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు కోలుకున్న తర్వాత లక్షణాలు లేకపోతే నేరుగా ఇంటికి వెళ్లేలా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. క్లినికల్ మేనేజ్ మెంట్ పై రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ రోగులకు డిశ్చార్జి సమయంలో నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య ఓ దశలో పెరిగినా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. మరోవైపు నియోజకవర్గానికి ఒక కొవిడ్ కేర్ సెంటర్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా చోట్ల టిడ్కో భవనాలను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆస్పత్రులు మినహా కొవిడ్ కేర్ సెంటర్స్ కి రోగులు రావడంలేదు. ప్రస్తుతానికి అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్స్ కి కేటాయించిన బెడ్స్ కూడా పూర్తి స్థాయిలో నిండలేదు.

ప్రస్తుతం ఏపీలో 1,15,425 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కేవలం 25శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతావారంతా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి విషయంలో.. ఇన్ పేషెంట్ గా చేరిన 3 రోజుల తర్వాత వారిలో లక్షణాలు కనిపించకపోతే, మరో మూడు రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించేయొచ్చని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే డిశ్చార్జి సమయంలో వారికి కొవిడ్ పరీక్ష తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది.

గతంలో ఆస్పత్రిలో చేరాలంటే కొవిడ్ పాజిటివ్, డిశ్చార్జి కావాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి. ఆరోగ్యం బాగున్నా కూడా కొవిడ్ నెగెటివ్ ఫలితం వచ్చే వరకు ఆస్పత్రుల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా అవసరం లేకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. లక్షణాలు లేకపోతే, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ లేకపోయినా రోగులను డిశ్చార్జ్ చేసేలా నిబంధనలు సవరించింది.

First Published:  29 Jan 2022 9:39 PM GMT
Next Story