Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 మూవీ షూటింగ్ అప్ డేట్స్

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా […]

ఎఫ్3 మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.

సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్, సినిమా మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ దృష్ట్యా సినిమాకు సంబంధించిన అప్డేట్లతో మేకర్లు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు.

రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్ నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మూడో హీరోయిన్ గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోంది.

దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేశాడు. సాయి శ్రీరామ్ కెమెరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతో మరో హిట్ పై కన్నేశారు వెంకీ, వరుణ్ తేజ్.

First Published:  29 Jan 2022 7:39 AM GMT
Next Story