Telugu Global
NEWS

గుడివాడ క్యాసినోపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి ఫిర్యాదు చేస్తారా..?

గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే.. 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ దాని గురించి ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని సెటైర్లు పేల్చారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని… వారికి చేతనైంది చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. మూడు రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే మరి 50 క్యాసినోలు ఏడాదంతా నడిచే గోవాలో ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగాలని ప్రశ్నించారు నాని. టీడీపీ వాళ్లు ఈ వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు […]

గుడివాడ క్యాసినోపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి ఫిర్యాదు చేస్తారా..?
X

గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే.. 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ దాని గురించి ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని సెటైర్లు పేల్చారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని… వారికి చేతనైంది చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. మూడు రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే మరి 50 క్యాసినోలు ఏడాదంతా నడిచే గోవాలో ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగాలని ప్రశ్నించారు నాని. టీడీపీ వాళ్లు ఈ వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కు కూడా ఫిర్యాదు చేస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం..
రాష్ట్రాల విభజనలో కృష్ణా జిల్లానుంచి వేరుపడిన భాగానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు కొడాలి నాని. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి నాని, టీడీపీపై ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిందేమీ లేకపోయినా ఆయన డబ్బా మీడియా వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ కొమ్ముకాసిందని విమర్శించారు కొడాలి నాని. కానీ ప్రజలు ఆ ప్రచారం నమ్మకుండా టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్‌ మధ్య వైరుధ్యం ఉన్నా తమ సీఎం జగన్ అవేమీ పట్టించుకోలేదని, తెలుగు ప్రజల కోసం సేవలు చేసిన ఎన్టీఆర్‌ ను స్మరించుకునేందుకు కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు. వైఎస్ఆర్ ఆశయాలనే కాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను జగన్ ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని అన్నారు.

First Published:  29 Jan 2022 5:51 AM GMT
Next Story