Telugu Global
Cinema & Entertainment

భీమ్లానాయక్ కు పోటీగా గంగూభాయ్

ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు. అయితే అదే తేదీకి తన సినిమా కూడా రాబోతున్నట్టు తాజాగా శర్వానంద్ ప్రకటించాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా ఫిబ్రవరి 25కే లాక్ చేశాడు. ఇప్పుడీ తేదీకి మరో పాన్ ఇండియా సినిమా కూడా సిద్ధమైంది. అదే గంగూబాయ్ కథియావాడీ. అలియా భట్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా భీమ్లానాయక్ కు పోటీగా, ఫిబ్రవరి 25న రాబోతోంది. బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ […]

భీమ్లానాయక్ కు పోటీగా గంగూభాయ్
X

ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు. అయితే అదే తేదీకి తన సినిమా కూడా రాబోతున్నట్టు తాజాగా శర్వానంద్ ప్రకటించాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా ఫిబ్రవరి 25కే లాక్ చేశాడు. ఇప్పుడీ తేదీకి మరో పాన్ ఇండియా సినిమా కూడా సిద్ధమైంది. అదే గంగూబాయ్ కథియావాడీ. అలియా భట్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా భీమ్లానాయక్ కు పోటీగా, ఫిబ్రవరి 25న రాబోతోంది.

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని సగర్వంగా ప్రకటించారు.

సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘బిగ్ అనౌన్స్‌‌మెంట్.. సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు’ అని ప్రకటించారు.

ఈ మూవీ ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ రాకతో జనవరి 6న రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. ఇలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా, ఇప్పుడు భీమ్లానాయక్ కు పోటీగా సిద్ధమైంది.

First Published:  29 Jan 2022 7:34 AM GMT
Next Story